ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న ప్రధాన అనుచరులు
వారి వెంటే బీజేపీ నాయకుల క్యూ..
రాజేందర్ తీరుపై అసంతృప్తి.. టీఆర్ఎస్లో చేరిక
మంత్రి హరీశ్‌రావు సమక్షంలో పింగిళి రమేశ్, చుక్క రంజిత్, పోలు లక్ష్మణ్ పార్టీలోకి..
జమ్మికుంట/ హుజూరాబాద్‌టౌన్, సెప్టెంబర్ 8: బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు గట్టి ఎదురుదెబ్బతాకింది. టీఆర్ఎస్లో చేరికల పరంపర కొనసాగుతున్నది. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆయా కుల సంఘాల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. బుధవారం ఆయన ప్రధాన అనుచరులు, నమ్మకస్తులు.. ఆయన కుడి, ఎడమ భుజాలైన డీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, మాజీ వైస్ ఎంపీపీ చుక్క రంజిత్ ఇద్దరూ బీజేపీ పార్టీని వీడారు. మంత్రి హరీశ్‌రావు సమక్షంలో స్థానిక ఎంపీఆర్ గార్డెన్లో వెయ్యి మందితో గులాబీ గూటికి చేరారు. దీంతో బీజేపీలో నాయకులంతా ఖాళీ అయ్యారు. తమ ఇంటి పార్టీ టీఆర్ఎస్కు వచ్చారు. ఈటల ఒంటరయ్యాడు. కాగా, రమేశ్, రంజిత్, తమ అనుచర వర్గంతో చేరికతో గులాబీ పార్టీ మరింత బలోపేతమైంది. అలాగే మత్స్య కార్మికశాఖ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు పోలు లక్ష్మణ్‌తో పాటు మరి కొందరు బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. వీణవంక మండలం దేశాయిపల్లిలోని పీఎస్కే గార్డెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో పార్టీలో చేరారు. జమ్మికుంట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కోరపల్లికి చెందిన శాలివాహన (కుమ్మరి) సంక్షేమ సంఘ కులస్తులు 50 మంది ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఉప్పల్‌లో 300 మంది
హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన 300మంది టీఆర్ఎస్లో చేరారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన 50మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. అనంతరం వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన 50మంది యాదవ సంఘ నాయకులు తరలిరగా, మంత్రి హరీశ్‌రావు కండువా కప్పి ఆహ్వానించారు. ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్ అని, దేశంలో అనేక రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలిపిన దార్శనికుడని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్‌రెడ్డి, స్వర్గం రవి, ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, పొనగంటి మల్లయ్య, తిరుపతిరావు పాల్గొన్నారు.