రైతులపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు
చివరి గింజ వరకూ కొంటాం
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర, నవంబర్ 7 : మద్దతు ధర అడిగినందుకు రైతులను వాహనాలతో తొక్కించిన చరిత్ర బీజేపీది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొంటామంటే కేంద్ర ప్రభుత్వం కొనబోమని కొర్రీలు పెడుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. గంగాధర మండలం నారాయణపూర్, మధురానగర్, మంగపేట గ్రామాలు, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని డబ్బుతిమ్మాయపల్లి, హిమ్మత్‌రావుపేట, తిర్మలాపూర్, సంద్రాలపల్లి, కోనాపూర్, సూరంపేట, గంగారాంతండా, రామ్‌సాగర్ గ్రామాల్లో ఆదివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సర్కారు పని చేస్తున్నదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నా, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో పండించిన చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, ఏపీఎం దేవరాజం, సర్పంచులు పునుగోటి కృష్ణారావు, డబ్బు రాధ, గంగుల పద్మ, మల్యాల మహిపాల్, చెక్కపల్లి స్వామిరెడ్డి, దర్శనాల కౌసల్య, భూక్య బొజ్జనాయక్, నీలగిరి మాధవి, సింగిల్ విండో చైర్మన్లు మేన్నేని రాజనర్సింగరావు, పోలు రాజేందర్, ఎంపీటీసీ సభ్యులు డబ్బు జగన్మోహన్రెడ్డి, బసనవేణి మహేశ్, గుగులోత్ సుజాత, ఆర్బీఎస్ మండల కో అర్డినేటర్ అంకం రాజేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు ఎండీ నజీర్, వేముల లావణ్య, తోట వేదాంతి, మడ్లపెల్లి గంగాధర్, పొట్టల కనకయ్య, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, బీసీ సెల్ అధ్యక్షుడు ఇప్పలపెల్లి మధుసూదన్, నాయకులు గౌతంరెడ్డి, గంగరావు, మల్లేశం, ముత్యంరెడ్డి, శంకర్, వినోద్‌నాయక్, రామిడి సురేందర్, వేముల అంజి, తోట మహిపాల్, గర్వందుల పరశురాములు, ముద్దం నగేశ్, ఎగుర్ల మల్లయ్య, పెంచాల చందు తదితరులు పాల్గొన్నారు.