కార్పొరేషన్, నవంబర్ 7: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని 18ఏండ్లు నిండిన వారంతా సద్వినియోగం చేసుకోవాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ ఎం.వీరబ్రహ్మయ్య సూచించారు. ఆదివారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి నగరంలోని ముకరంపుర ప్రభుత్వ ఉన్నత ఉర్దూ మీ డియం పాఠశాల, కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి జడ్పీహెచ్ఎస్, కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శేడ్ జడ్పీహెచ్ఎస్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్ల జాబితాలను పరిశీలించారు. బీఎల్వోలు, అంగన్వాడీ టీచ ర్లు, రిసోర్స్ పర్సన్లతో మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటర్ల జాబితాల సవరణ తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేయాలని బీఎల్వోలకు సూచించారు. 18 ఏండ్లు నిండిన వారందరినీ ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. చనిపోయిన వారి పేర్లను తొలగించాలని పేర్కొన్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించి వారి పేర్లను కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని తెలిపారు. ఒక పోలింగ్స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం-8 ద్వారా సరి చేయాలని సూచించారు. కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి తహసీల్దార్లు సుధాకర్, శ్రీనివాస్, బీఎల్వోలు, అంగన్వాడీ టీచర్లు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, నవంబర్ 7: దుర్శేడ్ జడ్పీ హైస్కూల్లో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఎలక్టోరల్ అబ్జర్వర్ ఎం.వీరబ్రహ్మయ్య పరిశీలించారు. పలు సూచనలు చేశా రు. కలెక్టర్ కర్ణన్, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ సుధాకర్, ఆర్ఐ రజినీకాంత్రెడ్డి, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు తదితరులున్నారు.