ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
మన్నెగూడెం, వెంకట్రావుపేటలో రైతు వేదికలు ప్రారంభం
రూ. 20 లక్షల నిధులతో నిర్మించే గోడౌన్‌కు భూమి పూజ
మన్నెగూడెంలో ఈత వనం పరిశీలన
మేడిపల్లి, నవంబర్ 7 : రైతు వేదికల్లో పంట మార్పిడిపై సమగ్ర చర్చ జరిపి ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు ఆర్థికంగా ఎదగాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని మన్నెగూడెం, వెంకట్రావుపేట గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఎమ్మెల్యే రమేశ్‌బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. భీమారంలో రూ.20 లక్షలతో నిర్మించే గోడౌన్‌కు భూమి పూజ చేశారు. మన్నెగూడెం, భీమారం, వెంకట్రావుపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మన్నెగూడెంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పెంచుతున్న ఈతవనాన్ని పరిశీలించారు. భీమారంలో మహిళా సంఘాల గ్రూపులకు లోన్ చెక్కును, లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడారు. మామిడి ప్రఖ్యాతిగాంచిన మండలమని, మామిడిని ప్రాసెసింగ్ చేసి జ్యూస్బాటిల్ ద్వారా వినియోగదారులకు చేరే దాకా రైతు పాత్ర ఉన్నైట్లెయితే లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. రైతులు సొసైటీగా ఏర్పడి పప్పు, నూనె దినుసులు, మక్కజొన్న సాగు చేయాలని, నాణ్యమైన దిగుబడి రావడంతో అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా 55 వేల ఎకరాలకు నీరందడంతో పండించిన వడ్లు ఆరబోసుకునేందుకు స్థలం లేని పరిస్థితి నెలకొందన్నారు. వరద కాలువపై లిఫ్టుల నిర్మాణానికి రూ. 704 కోట్ల ప్రతిపాదనలు ఆమోదానికి సిద్ధంగా ఉందని తెలిపారు. దీంతో మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లోని 45 వేల ఎకరాలకు సాగు నీరందిస్తుందని తెలిపారు.
రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దని, ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు, ఎంపీపీ దోనకంటి ఉమాదేవి, వైస్ ఎంపీపీ దొంతి శ్రీనివాస్, మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వంగ వెంకటేశం, సర్పంచులు చెక్కపెల్లి అరుణ, కాటిపెల్లి జగన్‌రెడ్డి, కాచర్ల సురేశ్, గడ్డం నారాయణరెడ్డి, కుందూరి బాలరాజు, ఈర్నాల సంపత్‌కుమార్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు చెన్నమనేని రవీందర్రావు, ఎంపీటీసీలు పల్లి అర్జున్, సుధవేని లక్ష్మి, మకిలీ దాస్, సింగిల్‌విండో చైర్మన్లు మెన్నేని రవీందర్రావు, కానుగంటి శ్రీనివాస్, ఆర్బీఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, మండలాధ్యక్షుడు మిట్టపెల్లి భూమారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు క్యాతం సత్తిరెడ్డి, నాయకులు ఉత్కం శంకర్‌గౌడ్, సుధవేని భూమేశ్, చెక్కపెల్లి రఘు, కోండ కిషన్ తదితరులు పాల్గొన్నారు.