ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
సుల్తానాబాద్, ఆగస్టు 7 : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని పద్మశాలీలు అభివృద్ధి చెందాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, కార్యదర్శి అయిల రమేశ్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చేనేత సంఘం కార్యాలయం, పూసాలలోని భక్తమార్కండేయ ఆలయంలో శనివారం మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం చేనేత కార్మికులను సన్మానించారు. స్వీట్లు పంచిపెట్టి వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా రామ్మూరి, రమేశ్, సాయిరి మహేందర్, వల్స నీలయ్య మాట్లాడారు. కులస్తులు ఐక్యంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పద్మశాలీ సేవా సంఘం జిల్లా కార్యదర్శి గాదాసు రవీందర్, యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెగడ చందు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మ రాజ్‌కుమార్, వల్స భాస్కర్, రాజమౌళి, ఆడెపు సదానందం, విశ్వనాథ్, నల్ల పోచమల్లు, కృష్ణమూర్తి, అడిగొప్పుల సతీశ్, ప్రభాకర్, శ్రీనివాస్, ఆంజనేయులు, శివకుమార్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఎలిగేడు, ఆగస్టు 7: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సంఘం నాయకులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలిగేడు పద్మశాలి సంఘం కార్యాలయంలో నలుగురు చేనేత కార్మికులకు శాలువాలు కప్పి, పూల మాలలు వేసి సన్మానించారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు గ్యాజంగి భాస్కర్, మండలాధ్యక్షుడు మామిడాల రమేశ్, గ్రామశాఖ అధ్యక్షుడు కోడూరి కైలాసం, కట్ల రాజేశం, పోరండ్ల కుమార స్వామి, వెంగల్దాస్ వెంకటరమణ, సుంకెనపల్లి అంజయ్య, కట్ల తిరుపతి, కట్ల రవి, కట్ల సత్యనారాయణ, కట్ల ప్రకాశ్ తదితరులున్నారు.
సింగరేణి ఆధ్వర్యంలో..
గోదావరిఖని, ఆగస్టు 7: సింగరేణి ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో ఇన్చార్జి జీఎం కేవీ రావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు హాజరై చేనేత, నూలు మాస్కులను జీఎం కార్యాలయ సిబ్బందికి, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని, వాటిపై ఆధారపడిన వారిని ప్రోత్సహించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇండ్లతోపాటు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఎంవోఏఐ ప్రతినిధి డేవిడ్, ఎస్వోటూ జీఎం త్యాగరాజు, మేడిపల్లి పీవో సత్యనారాయణ, ఏజెంట్ చిలుక శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ ఉన్నారు.
ధర్మారం/ పెద్దపల్లి కమాన్, ఆగస్టు 7: మండల కేంద్రంలో పద్మశాలీ సంఘం పట్టణశాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు బొట్ల లక్ష్మీనర్సయ్య, పట్టణాధ్యక్షుడు గోనె దేవయ్య, జనరల్ సెక్రటరీ సామల రాజయ్య, కోశాధికారి కుంట రాజు, సభ్యులు శ్రీనివాస్, దేవసాని సత్యనారాయణ, చింతల రాజేశం, సుంకే శ్రీనివాస్, పులి విట్టల్, గౌడ నంబయ్య, గూడెం నారాయణ, గౌడ శేఖర్, సిరిమల్లె మోహన్, విట్ట రవి, బుధారపు వేణు, తుమ్మ శ్రీనివాస్, చిప్ప వెంకటేశ్, బుధారపు నరేశ్ ఉన్నారు.