ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
పట్టణంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
జగిత్యాల అర్బన్, ఆగస్టు 7: టీఆర్ఎస్ పాలనలోనే చేనేత కార్మికులకు మంచి రోజులు వచ్చాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని చేనేత సహకార సంఘ భవనంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను సన్మానించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి రంగంగా ఉన్న చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. జగిత్యాలలో పవన్ లూమ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు అడువాల జ్యోతి, దాసరి లావణ్య, హనుమాండ్ల జయశ్రీ, అల్లె గంగసాగర్, క్యాదాసు నవీన్, పోపా అధ్యక్షుడు ఏవీఎన్ రాజు, కార్యదర్శి రాజేశ్, పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షుడు సిరిపురపు రాజలింగం, పట్టణ ప్రధాన కార్యదర్శి బోగ గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెట్పెల్లి సుధాకర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, వస్త్ర వ్యాపారం సంఘం కార్యదర్శి గౌరి శ్రీను, మాజీ అధ్యక్షుడు జేడీ జయంత్, సంఘం డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.
గోదాం ప్రారంభం
సారంగాపూర్, ఆగస్టు 7: బీర్పూర్ మండలంలోని మంగెళ గ్రామంలో రూ.9.20లక్షలతో నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం గోదాంను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించి, రైతులకు ఎరువుల బస్తాలను అందించారు. గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. కండ్లపల్లిలో సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కొల్వాయిలో వివిధ గ్రామాలకు చెందిన 11 మందికి రూ.2.87 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నారపాక రమేశ్, కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కొల్ముల రమణ, మండల కన్వీనర్ మెరుగు రాజేశం, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్ల మైపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.