దళిత కాలనీల అభివృద్ధికి కృషి
దళిత బంధుతో జీవితాల్లో వెలుగులు నింపుతున్నడు
హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 7: దళితుల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ ఉద్ఘాటించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోనే విప్లవాత్మక దళిత బంధు పథకాన్ని తేవడమే కాకుండా కాలనీల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. శనివారం రంగాపురం, రాంపూర్, రాజపల్లి, సిర్సపల్లి, వెంకట్రావుపల్లి, పోతిరెడ్డిపేట గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. దళిత కాలనీల్లో సుమారు రూ.5కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన దళిత కుటుంబాలందరికీ దళితబంధు సాయం అందిస్తామని చెప్పారు. ఈ నెల 16న శాలపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని దళితులకు మార్గనిర్దేశం చేస్తారని, సభను జయప్రదం చేయాలని కోరారు. కాగా, మండలంలోని 19 గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.15.64కోట్లు మంజూరయ్యాయని, దళిత కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు 100 శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో దళిత కాలనీల్లో ఎమ్మెల్యేకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లతో ర్యాలీగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు ఎడవెల్లి కొండల్ రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు చోల్లేటి కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి కిషన్‌రెడ్డి, మండల కన్వీనర్ సంగెం ఐలయ్య, మాజీ జడ్పీటీసీ కె.విజయరెడ్డి, సర్పంచులు తాటికొండ పుల్లాచారి, మనోహర్, సువర్ణాల సునయానం, వైస్ చైర్మన్ బండి రమేశ్, నాయకులు పోలంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మొలుగురి ప్రభాకర్, కన్నబోయిన శ్రీనివాస్, చొక్కారావు, సదాన్రెడ్డి, రా జేందర్‌రెడ్డి, కేతిరి రాజప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.