కమాన్‌చౌరస్తా, జనవరి 7: జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో శుక్రవారం సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా నిర్వహించారు. నగరంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ సూల్ ఆఫ్ జెన్నెక్ట్స్, టైనీటాట్స్ పాఠశాలలో పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన సంబురాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలను విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి ప్రారంభించి, మాట్లాడారు. సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కాగా, విద్యార్థులు వివిధ వేషధారణలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
పారమిత విద్యాసంస్థలో..
పారమిత విద్యాసంస్థలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు, డైరెక్టర్లు రశ్మిత, ప్రసూన, రాకేశ్, వినోద్‌రావు, అనూకర్ రావు, వీయూఎం ప్రసాద్, ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హనుమాన్‌నగర్‌లోని బ్లూబెల్స్ పాఠశాల ఆవరణను ముగ్గులతో అలంకరించి, భోగి మంటలు వేయగా, ప్రిన్సిపాల్ జంగ సునీత-మనోహర్‌రెడ్డి వేడుకలను ప్రారంభించారు. ఈ క్రమంలో విద్యార్థులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చిన్నారులు హరిదాసు వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బ్రాహ్మణవీధిలోని నారాయణ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలను విద్యాసంస్థల రాష్ట్ర సమన్వయకర్త రవళి, ఎంఈవో మధుసూదన్ రావు ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఆయూబ్, డీన్ సంపత్, సెంట్రల్ కో-ఆర్డినేటర్ లూసి, సిబ్బంది వినోద, ప్రత్యూష, ఎలిజబెత్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వాణీనికేతన్ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు పతంగుల పోటీలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ రేణుక బహుమతులు అందజేశారు. విద్యావాలీ పాఠశాలలో నిర్వహించిన వేడుకలను కరస్పాండెంట్ రామవరం లక్ష్మీప్రకాశ్ రావు, వైస్ చైర్మన్ పృథ్వీ రావు ప్రారంభించారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. అనంతరం విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలక్ష్మి, తెలుగు విభాగం అధిపతి డాక్టర్ మట్టా సంపత్‌కుమార్‌రెడ్డి, అధ్యాపకులు కంజర్ల శ్రీలత, నారోజు వెంకటరమణ, లక్ష్మణరావు, తిరుపతి, శోభారాణి, చక్రవర్తి, విద్యార్థినులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జనవరి 7: నగరంలోని మానేరు పాఠశాల ప్రాంగణాన్ని మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. భోగి మంటలు ఏర్పాటు చేశారు. రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. పలువురు విద్యార్థులు గోదాదేవి, హరిదాసు, గంగిరెద్దుల వేషధారణలో ఆకట్టుకున్నారు. అంతకుముందు వేడుకలను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి ప్రారంభించి, మాట్లాడారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేడుకల్లో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.