ప్రజలకు జవాబుదారీగానే ప్రజాకోర్టుకు హాజరు
ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోనెపై ధ్వజం
గోదావరిఖని, జనవరి 7: సమర్థవంతమైన పాలనతో ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే మంత్రి కొప్పుల ఈశ్వర్, తనపై అసత్యపు ఆరోపణలు చేస్తే ప్రజలు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. మాజీ ఎమ్మె ల్యే గోనె ప్రకాశ్‌రావు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్‌పై ఇటీవల చేస్తున్న వరుస ఆరోపణలపై శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రజా కోర్టు బహిరంగ చర్చలో ఎమ్మెల్యే కోరుకంటి తీవ్రంగా స్పందించారు. తమపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని, ప్రజా కోర్టుకు వస్తున్నానని, పూర్తి ఆధారాలతో హాజరు కావాలని గోనెకు సవాల్ విసరగా ఆయన చర్చకు హాజరు కాలేదు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, తమ పాలనలో ప్రజలకు అసౌకర్యం కలిగితే ఎత్తి చూపాలి గానీ, వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. సరైన ఆధారాలుంటే ధైర్యంగా హాజరై నిరూపించాలన్నారు. కుంటి సా కులతో తప్పించుకోవడం సరికాదన్నారు. తమను నమ్మి గెలిపించిన ప్రజలకు జవాబుదారీగానే ఈ ప్రజాకోర్టుకు హాజరయ్యానన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తున్న తమను అవహేళన చేసినా, అవమానపరిచే విధంగా మాట్లాడినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మేయర్ డా.అనిల్‌కుమార్, జడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు ఇంజపురి పులెందర్, ధాతు శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, సాగంటి శంకర్, కన్నూరి సతీశ్, రమణారెడ్డి, కృష్ణవేణి, గట్టయ్య, శంకర్ నాయక్, భాస్కర్, బాల రాజ్‌కుమార్, దొంత శ్రీనివాస్, వేణు, పెంట రా జేశ్, కో-ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్, చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు బొడ్డు రవీందర్, రాకం వేణు, వేగోలపు శ్రీనివాస్, తానిపర్తి గోపాల్ రావు, రామస్వామి, సంజీవ్, జాహిద్ పాషా, శ్రీనివాస్, మధుకర మారుతి, వేణు, బాలరాజు, తోకల రమేశ్, చిలుముల విజయ్ ఉన్నారు.