సైదాపూర్, జనవరి 7: తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం గొడిశాల, ఆకునూర్, సైదాపూర్, వెన్నెంపల్లి గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించడంతో పాటు రైతు బంధు వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఆయా చోట్ల వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతు బంధు పథకంతో రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల నాయకుడు రేగుల అశోక్ రూపొందించిన క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిషరించారు. కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాల్ రావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చందా శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు కొత్త తిరుపతి రెడ్డి, బిల్లా వెంకట్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ రావుల రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, సర్పంచులు కాయిత రాములు, అబ్బిడి పద్మా రవీందర్ రెడ్డి, చింత లతా కుమారస్వామి, కొండ గణేశ్, కొత్త రాజిరెడ్డి, బత్తుల కొమురయ్య, ఆవునూరి పాపయ్య, పైడిమల్ల సుశీలా తిరుపతి గౌడ్, తాటిపెల్లి యుగేంధర్ రెడ్డి, రేగుల సుమలతా అశోక్, గుండేటి సునీతా జయకృష్ణ, బొడిగా పద్మజా కొమురయ్య, తొంట కాంతమ్మ, ఎంపీటీసీలు తొంట ఓదెలు, బద్దిపడిగ అనితారవీందర్ రెడ్డి, గాజర్ల భాగ్యాఓదెలు, తహసీల్దార్ సదానందం తదితరులు పాల్గొన్నారు.