కార్పొరేషన్, జనవరి 7;కరీంనగర్ నగరపాలక సంస్థకు సీఎం కేసీఆర్ గతంలో ప్రత్యేకంగా రూ.350 కోట్ల మంజూరు చేయగా.. వీటికి సంబంధించిన నిధుల్లో రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ నిధులతో నగరంలో అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేస్తామని మేయర్ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. కాగా, నిధులను విడుదల చేయించిన మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.