ఘనంగా జయశంకర్ జయంతి
నివాళులర్పించిన మంత్రులు కొప్పుల, గంగుల, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఊరూరా వేడుకలు
కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 6:తెలంగాణ జాతిపిత, ఫ్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ‘సర్’ చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ప్రొఫెసర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు చోట్ల కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరిగాయి. కరీంనగర్‌లోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పూలమాల వేసి, సర్ సేవలను స్మరించుకున్నారు. జమ్మికుంటలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీ నారదాసు ప్రొఫెసర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పట్టణంలోని ‘సర్’ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు ఆవరణలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, హుజూరాబాద్ మండలంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, వీణవంక మండలం దేశాయిపల్లిలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, పెద్ది సుదర్శన్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జరిగిన జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
బంగారు తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడే జయశంకర్ సార్ కన్న కలను సాకారం చేసిన వాళ్లమవుతామని, అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఆయన జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెడుతూ బంగారు తెలంగాణ ఏర్పాటుకు అడుగులు వేయిస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మావురం మహేశ్, వెంకటరమణారెడి,్డ కొత్తూరి నరేశ్, తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి పోలీస్‌స్టేషన్, మున్సిపల్ కార్యాలయం, ఆదర్శ పాఠశాల, తహసీల్ కార్యాలయాల్లో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఐ నాగేశ్వర్రావు, ఎస్ఐ వంశీకృష్ణ, ట్రైనీ ఎస్ఐ రణ్‌ధీర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, తహసీల్దార్ రజిత, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రమేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మండల కేంద్రంలోని కర్ర, ఇనుము వ్యాపారుల సంఘ కార్యాలయ ఆవరణలో జయశంకర్ చిత్రపటానికి మండల విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వబ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షుడు ఉదారం వేణు, మండల ప్రధాన కార్యదర్శి ఉదారం కనకాచారి, వెంకటచారి, మహేశ్, శ్రీనివాస్, శ్రీనివాస్, స్వామి, రామకృష్ణ, మహేశ్, స్వామి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, ఆగస్టు 6: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తాండ్ర వివేక్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశరాజ్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి సర్పంచ్ కోల రమేశ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సతీశ్‌రావు, శిక్షణ ఎస్ఐ నరేశ్, హెడ్‌కానిస్టేబుల్ జీవన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు భూమయ్య, పరశురాములు, రమేశ్, మహిళా కానిస్టేబుల్ జ్యోతి, హోంగార్డు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, ఆగస్టు 6: ఉప్పరమల్యాల ప్రభుత్వ పాఠశాలలో జయశంకర్ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఆగస్టు 6: మండల పరిషత్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణయాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో పవన్‌కుమార్, సూపరింటెండెంట్ సంపత్‌కుమార్, ఏఈ రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.