దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు
జమ్మికుంటకు రింగ్‌రోడ్
గజ్వేల్ తరహాలో హుజూరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
జమ్మికుంట/హుజూరాబాద్/వీణవంక, జూలై 6: ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలని, రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన ఉద్యమ ఫలితాలను ప్రభుత్వ పథకాల రూపంలో ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అ మలు చేస్తూ, ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాపాడుతున్నారని కొనియాడారు. జమ్మికుంట పట్టణంలోని 4, 5వ వార్డులు, వీణవంక మండలం ఘన్ముక్ల, బొంతుపల్లి గ్రామాల్లో పట్టణ, పల్లె ప్రగ తి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. జమ్మికుం ట, ఘన్ముక్ల ఆదర్శ పాఠశాల ఆవరణ, బొంతుపల్లి వైకుంఠధామంలో మొక్కలు నాటి, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. టీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయాచోట్ల కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీలో తొక్కని గడప లేదని, మొక్కని కాళ్లు లేవని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని, ఆయనే మనకు స్ఫూర్తి అని స్పష్టం చేశా రు. రైతు బంధు, రైతు బీమాతో రైతులకు అన్న లా, పింఛన్లతో కొడుకులా.. కల్యాణలక్ష్మి మేనమామలా పథకాలను సీఎం అమలు చేస్తున్నారని ప్రశంసించారు. పల్లె, పట్టణ ప్రగతి గొప్ప కార్యక్రమాలని, కేసీఆర్ మానసపుత్రికలని కొనియాడారు.
అభివృద్ధిలో మనమే ఆదర్శం..
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, దానికి నిదర్శనం గ్రామాల్లో జరుగుతున్న పనులేనని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఒకప్పుడు కరెంట్ లేక తెలంగాణలో తీగలపై బట్టలు ఆరేసుకునే వారని, కానీ ఇప్పుడు కరెంట్‌ను ఉత్పత్తి చేసి అమ్మేస్థాయికి చేరుకున్నామని చెప్పారు. ఇప్పటి పిల్లలకు కరెంట్ పోవడమంటే ఏంటో తెలియదని, ఇది కేవలం సీఎం కేసీఆర్ కృషేనని తెలిపా రు. దేశంలో ఇవాళ రైతులు పండించిన ధాన్యాన్ని ఏ ప్రభుత్వాలు కొంటలేవని, కరోనా కష్టకాలంలో కూడా దూరదృష్టితో చివరి గింజదాకా కొనుగోలు చేసింది కేవలం మన ప్రభుత్వమేనని చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లలో అన్నం కూడా సరిగ్గా దొరకని పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ నేడు ఆదర్శ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలు ఖర్చు చేసి, వారికి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని చెప్పారు. ఇలా దేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు చేస్తుందో చర్చకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. నర్సింగ్ విద్యార్థులకు ఇచ్చే ైస్టెపెండ్ను ఏకంగా 5 వేలకు పెంచారని, కరోనా కష్టకాలంలో పని చేస్తున్న ఆశ కార్యకర్తలకు కూడా త్వరలోనే ప్రభుత్వం తీపికబురు అందిస్తుందని వెల్లడించారు. పలువురు రైతులు భూ సమస్యలను వినోద్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా, ప్రభుత్వంతో మాట్లాడి అసిస్టెంట్ కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. బొంతుపల్లి వైకుంఠధామం నిర్మాణం, పల్లెప్రకృతివనం బాగుందని సర్పంచ్ లక్ష్మిని అభినందించారు.
జమ్మికుంటను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
జమ్మికుంటను అద్భుతంగా తీర్చిదిద్దుతామని, ఇక్కడి ప్రజల సౌకర్యం కోసం రింగ్‌రోడ్‌ను ఏర్పా టు చేయిస్తానని హామీ ఇచ్చారు. అందుకు ప్రణాళికలు అందిస్తే.. సీఎంతో మాట్లాడి మంజూరు చేయిస్తానని వినోద్‌కుమార్ చెప్పారు. జమ్మికుంటలో ఇప్పటికే 40వేల మొక్కలు నాటారని, మరో 40వేల మొక్కలు నాటుకుందామని పిలుపునిచ్చా రు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఇంటికీ 6 మొక్కలు అందజేయాలని అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్పర్సన్ విజయ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ సింగిల్‌విండో చైర్మన్ మాడ సాదవరెడ్డి, కో ఆప్షన్‌మెంబర్ హమీద్, ఘన్ముక్ల సర్పంచ్ సునీత, ఎంపీటీసీలు చదువు స్వరూప, నాగిడి సంజీవరెడ్డి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, యాదగిరి, రవీందర్‌రెడ్డి, కృష్ణమోహన్‌రావు, మల్లయ్య, శ్రీరాం, ప్రవీణ్, రవీందర్రావు, మహేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మూల పుల్లారెడ్డి ఉన్నారు.
గుడి నిర్మాణానికి 40లక్షలు మంజూరుకు హామీ
జమ్మికుంటలోని రామన్నపల్లి ‘సంకల్ప్ యూ త్’ను వినోద్‌కుమార్ కలిశారు. యూత్ కమిటీ సభ్యులతో మాట్లాడారు. రామన్నపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణానికి సహాయం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేయగా, వినోద్‌కుమార్ స్పందించారు. గుడి నిర్మాణం కోసం మంత్రులు కొప్పుల, గంగుల, విప్ సుమన్‌తో చర్చించి, సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పా రు. 40లక్షలు వెంటనే మంజూరయ్యేలా చూస్తానని, త్వరలో ఆర్డర్ కాపీని అందిస్తామని హామీ ఇవ్వగా, యూత్ నాయకులు సంబురపడ్డారు. నాయకులు పోల్సాని హన్మంత్‌రావు(అంజి), రాకేశ్, ప్రజాప్రతినిధులు, ప్రజలున్నారు.
గజ్వేల్ తరహాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్
హుజూరాబాద్‌లో గజ్వేల్ తరహాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో, సైదాపూర్ రోడ్డు చౌరస్తాలో నిర్వహించిన జగ్జీవన్‌రామ్ వర్ధంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. గతంలో కాకతీయ కాలువ పక్కన స్థలాన్ని మార్కెట్‌కు కేటాయించగా, దానిని రద్దు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్డీవో కార్యాలయం, కేడీసీసీ బ్యాంకు ఆవరణలో స్థలాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వారం రోజుల్లో స్థలం నిర్ణయం జరుగుతుందని, ఆ వెంటనే భూమిపూజ జరిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పుడున్న ఆర్డీవో కార్యాలయం కేసీ క్యాంపులో నిర్మించనున్నట్లు, అక్కడ మినీ కలెక్టరేట్ మాదిరిగా భవన సముదాయం ఉంటుందని తెలిపారు. పట్టణాన్ని అన్ని హంగులతో సుందరీకరించేందుకు కేసీఆర్ నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, నాయకులు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.