శంకరపట్నం, నవంబర్ 5: రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతి ధాన్యం గింజనూ కొంటామని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భరోసా ఇచ్చారు. శుక్రవారం తాడికల్ సింగిల్ విండో పరిధిలోని కరీంపేట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం వరి ధాన్యం కొనేది లేదనడం వల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఏదేమైనా ప్రస్తుత వానకాలం పంటను మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వచ్చే ఏడాది ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలను రూపొందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ గూడూరి శ్రీనివాస్‌రావు, ఎస్ఐ ప్రశాంత్‌రావు, తాడికల్, మెట్పల్లి, గద్దపాక సింగిల్ విండోల చైర్మన్లు కేతిరి మధూకర్‌రెడ్డి, పొద్దుటూరి సంజీవరెడ్డి, గుర్రాల తిరుపతిరెడ్డి, సర్పంచ్ వనపర్తి మల్లయ్య, ఎంపీటీసీ గాండ్ల తిరుపతయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాజాపాషా, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వీరెల్లి కొమురారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, కార్యదర్శి ప్రదీప్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
సొంత గూటికి వార్డు సభ్యురాలు
కరీంపేట్ వార్డు సభ్యురాలు స్వరూప శుక్రవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పర్యటన సందర్భంగా ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమెకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ, తాను తిరిగి సొంత గూటికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, ఎంపీటీసీ గాండ్ల తిరుపతయ్య, తాడికల్ సింగిల్‌విండో చైర్మన్ కేతిరి మధూకర్‌రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాజాపాషా, టీఆర్ఎస్ నాయకులు ముంజ వెంకటేశం, తుమ్మేటి అనంతరెడ్డి, గుర్రం భాగ్యలక్ష్మి, కొయ్యడ కుమార్‌యాదవ్, బొజ్జ రవి, తదితరులు ఉన్నారు.