హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మిగూడలో హౌసింగ్ బోర్డుకు చెందిన 14 ప్లాట్లకు బుధవారం వేలంపాట నిర్వహించగా, గరిష్ఠంగా గజం ధర రూ.51వేలు పలికినట్టు బోర్డు ఎండీ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చదరపు గజానికి రూ.32వేల కనీస ధర నిర్ణయించగా, ప్లాట్లు కొనేందుకు 49 మంది పోటీపడ్డారని పేర్కొన్నారు. అతి తకువగా చదరపు గజానికి రూ.36 వేల ధర పలుకగా, సగటున చదరపు గజం భూమి రూ. 44,285 ధర పలికినట్టు వెల్లడించారు. మొత్తం 14 ప్లాట్ల విక్రయం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపారు.