ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 18: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం రద్దు చేయాలని కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరా వు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కార్పొరేట్ యాజమాన్యానికి వత్తాసు పలకకుండా అందరికీ ఒకే ఉచిత విద్యావిధానాన్ని రూ పొందించాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభమైన ఏఐఎస్ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ అలుపెరుగని పోరాటాలు చేస్తున్నదన్నారు.
అన్ని విద్యార్థి సంఘాలకు మూలం ఏఐఎస్ఎఫ్ అని, ఇది అన్ని సంఘాలకు మాతృ సంఘమని పేర్కొన్నారు. ఎందరో నాయకులు ఈ సంఘం ద్వారా ఎదిగారని, తాను కూడా ఏఐఎస్ఎఫ్ ద్వారా నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం యూజీసీ ద్వారా ఉన్నత విద్యాసంస్థలకు నిధులు రాకుండా చేస్తున్నదని ఆరోపించారు. విద్యార్థులు భగత్‌సింగ్, చేగువేరాను హీరోలుగా గుర్తించాలని, సినిమా హీరోలని కాదని సూచించారు.