మూడ్రోజులపాటు కూరగాయల సాగుపై సమావేశాలు : దండ రాజిరెడ్డి
తెలంగాణ ఉద్యానవర్సిటీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లో కూరగాయల సాగుపై అఖిలభారత సమన్వయ పరిశోధన పథకం సమావేశాలు నిర్వహించనున్నట్టు వర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యానవర్సిటీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లో కూరగాయల సాగుపై అఖిలభారత సమన్వయ పరిశోధన పథకం సమావేశాలు నిర్వహించనున్నట్టు వర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 20 నుంచి 22 వరకు మూడ్రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సుమారు 300 మందికిపైగా శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొంటారని చెప్పారు. ప్రముఖ విత్తన సంస్థ నిపుణులు, భారత ప్రభుత్వ విత్తన ప్రతినిధులు కూడా హాజరుకానున్నట్టు వెల్లడించారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, వారణాసి, బెంగళూరు, ఢిల్లీలోని భారతీయ పరిశోధనల సంస్థల నుంచి పలువురు శాస్త్రవేత్తలు, నిపుణులు హాజరవుతారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పరీక్షించిన సూటి (దేశీయ) రకాలు, హైబ్రిడ్ రకాలు, విత్తన ఉత్పత్తిలో మేలైన పద్ధతులు, జనక (జన్యు) రకాల సేకరణ, పంటల ఆధునిక సాగు, చీడపీడలు, అతివృష్టి, అనావృష్టి తదితర వాటిపై చర్చించనున్నట్టు తెలిపారు. 22న ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో రైతుల ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలు చెబుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఏ భగవాన్, పరిశోధన సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, కూరగాయల పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ డీ అనితకుమారి, ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పీ ప్రశాంత్, డాక్టర్ ప్రీతంగౌడ్, ప్రొఫెసర్ సైదయ్య, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

