కోల్‌సిటీ, సెప్టెంబర్ 5: విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు సన్మానించారు. ఈమేరకు గోదావరిఖనిలోని లయన్స్ భవన్లో ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు హరినాథ్ శర్మ, కోటేశ్వరరావు, సంధ్యారాణిని శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ ముద్దసాని ప్రమోద్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. క్లబ్ అధ్యక్షుడు గంగాధర్ అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమంలో కార్యదర్శి తిలక్ చక్రవర్తి, మనోజ్‌కుమార్, రామస్వామి, జోన్ చైర్మన్ గుగ్గిళ్ల రవీంద్రాచారి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేందర్, బూర లక్ష్మీనారాయణ, భిక్షపతి, ముడతనపల్లి సారయ్య, గుండా రాజు ఉన్నారు.
ధర్మారం, సెప్టెంబర్5: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పతంజలి యోగా సాధన సభ్యులు, అంబేద్కర్ చౌరస్తాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలో పని చేసే ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులను యోగా గురూజీ జంగిలి సుధాకర్‌ను వేర్వేరుగా సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తన్నీరు రాజేందర్,జిల్లా కోఆర్డినేటర్ సామ ఎల్లారెడ్డి, జిల్లా చైర్ పర్సన్ డాక్టర్ కామని శ్రీనివాస్, క్లబ్ ఉపాధ్యక్షులు ఎలగందుల అశోక్, ఇప్ప మల్లేశం, ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల మునీందర్,పీఆర్వో దాడి భూమయ్య, కోశాధికారి ఎండీ బాబా, క్లబ్ బోర్డు డైరెక్టర్ నర్సింగం పాల్గొన్నారు.
జూలపల్లి, సెప్టెంబర్ 5: కోనరావుపేటలో విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు బాలెంగుల హన్మయ్యను పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఇక్కడ నాయకులు మేర్గు రమేశ్, సంబారి ఆంజనేయులు, దీకొండ ఆంజనేయులు, సంబారి శ్రీనివాస్, రాజు, చంద్రమౌళి, కోడూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి కమాన్, సెప్టెంబర్ 5: లయన్స్ క్లబ్ ఎలైట్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో హెచ్ఎంలు అన్నపూర్ణ, భాగ్యలక్ష్మి, ఆగయ్య, కృష్ణారెడ్డి, తెలుగు ఉపాధ్యాయురాలు వాసంతిని శాలువాలు కప్పి సన్మానించి, పూల మొక్కలను అందించారు. అనంతరం పాఠశాల ఆవరణలో వారందరూ కలిసి మునగ, పండ్ల మొక్కలను నాటారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఎలైట్ పెద్దపల్లి సభ్యులు బండ బాబురావు, జోన్ చైర్పర్సన్ అశోక్‌కుమార్, వంశీరాజ్, సంపత్‌రావు, రవీందర్, సతీశ్‌రెడ్డి, కంకటి శ్రీనివాసులు, లక్ష్మణ్, భాస్కర్‌రావు, పిట్ట వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
తీర్చిదిద్దడంలో కీలకం
మంథని టౌన్, సెప్టెంబరు 5: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ విగ్రహానికి శైలజ, ఏఎంసీ చైర్ పర్సన్ శ్రీరాంభట్ల సంతోషిణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు వీకే రవి, శ్రీపతి బానయ్య, కుర్రు లింగయ్య పాల్గొన్నారు.
సేవలు మరువలేనివి
మంథని టౌన్, సెప్టెంబరు 5: ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయం తి వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రిటైర్డు డీవీఈవో, ఎంఈవో మధూకర్, గంగాధర్‌ను శాలువాలతో సన్మానించారు.
మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండెల మారుతి స్థానిక ప్రెస్ క్లబ్లో పలువురు ఉపాధ్యాయులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో పోరెడ్డి వెంకట్‌రెడ్డి, రిటైర్డు ఉపాధ్యాయులు మారుతిరావు, విఠల్, కృష్ణదాస్, గట్టు జయప్రకాశ్, అధ్యాపకులు రావుల తిరుమల్, ఉపాధ్యాయులు భరత్‌రెడ్డి, పోచయ్య, చంద్రశేఖర్, గుమ్మడి రాకేశ్ పాల్గొన్నారు.