విద్యానగర్, జనవరి 5: కరోనా రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (సైన్స్‌వింగ్) ప్రిన్సిపాల్ మదన్మోహన్రావు కోరారు. కళాశాలలో బుధవారం 15-18 ఏళ్లలోపు విద్యార్థులకు ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, 15-18 ఏళ్లలోపు విద్యార్థులు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సుధాకర్‌రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ జీవన్, అధ్యాపకులు శ్రీనివాస్, స్వర్ణకుమారి, అనిత, ప్రేంసాగర్, ఏఎన్ఎంలు రజిత, వసంత తదితరులు పాల్గొన్నారు. అలాగే, సప్తగిరికాలనీలోని ప్రభుత్వ పాఠశాల, డాక్టర్స్ స్ట్రీట్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సిన్ వేశారు.
నగరంలోని కేంద్రాలు ఇవే..
బీఆర్ఆర్ కాలనీ హెల్త్ సెంటర్ పరిధిలో శివాజీనగర్, విద్యానగర్ సెంటర్ పరిధిలో ఆర్టీసీ వర్కుషాపు, సాలంపుర ప్రాథమిక పాఠశాల, సప్తగిరి కాలనీ సెంటర్ పరిధిలో సప్తగిరికాలనీ అర్బన్ హెల్త్ సెంటర్, కట్టరాంపూర్ సెంటర్ పరిధిలో కట్టరాంపూర్ అర్బన్ హెల్త్ సెంటర్, అంబేద్కర్ స్టేడియం, గణేశ్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. హౌసింగ్‌బోర్డుకాలనీ సెంటర్ పరిధిలో హౌసింగ్బోర్డుకాలనీసెంటర్, కాపువాడలోని వజ్రమ్మ ఫంక్షన్ హాల్, అంగన్వాడీ సెంటర్, మోతాజీఖానా అర్బన్ హెల్త్ సెంటర్ పరిధి, బాంబే స్కూల్, ఎన్ఎన్ గార్డెన్, జిల్లా ప్రభుత్వ దవాఖానలోని వెల్నెస్ సెంటర్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.