కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్ ఓటరు తుది జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 నియోజకవర్గంలోని ఓటర్ల వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్లో పురుషులు 5,01,630, మహిళలు 5,09,516, ఇతరులు 33 చొప్పున మొత్తం 10,11,179 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లాలో పురుషులు 3,17,268 మహిళలు 3,36,323, ఇతరులు 17 చొప్పున మొత్తం 6,53,608 మంది ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో పురుషులు 3,35,251 మహిళలు 3,33,372, ఇతరులు 45 మంది చొప్పున 6,68,668 మంది ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుషులు 2,14,654 మహిళలు 2,25,549, ఇతరులు 3 చొప్పున మొత్తం 4,40,206 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళలు 35,957 మంది అధికంగా ఉన్నారు.
కరీంనగర్ జిల్లా..
జిల్లాలో 10,11,179 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,01,110 మంది పురుషులు, 5,09,497 మంది మహిళలు, 33 మంది ఇతరులు, 116 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఇక సర్వీసు ఓటర్లలో 520 మంది పురుషులు, 19 మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా కరీంనగర్ నియోజకవర్గంలో 3,39,291 మంది ఓటర్లు ఉండగా, రెండో స్థానంలో హుజూరాబాద్‌లో 2,34,904 మంది, మూడో స్థానంలో చొప్పదండిలో 2,24,894 మంది, ఆఖరి స్థానంలో మానకొండూర్‌లో 2,11,551 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
జగిత్యాల జిల్లా..
జగిత్యాల జిల్లాలో మొత్తం ఓటర్లు 6,53,608 మంది ఉన్నట్లు కలెక్టర్ జీ రవి తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలో 1,08,859 మంది పురుషులు, 1,18,506 మంది మహిళలు, ఒకరు ఇతరులు, 46 మంది సర్వీస్ ఓటర్ల చొప్పున మొత్తం 2,27,366 మంది ఉన్నారు. జగిత్యాలలో 1,03,665 మంది పురుషులు, 1,10,330 మంది మహిళలు, 13 మంది ఇతరులు, సర్వీస్ ఓటర్లలో 35 మంది పురుషులు, మహిళలులు 3 ఉండగా మొత్తం 2,14,228 ఓటర్లున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో 1,04,524 పురుషులు, 1,07,487 మంది మహిళలు, ఇతరులు ముగ్గురు ఉండగా, 117 మంది సర్వీస్ ఓటర్లున్నారు. మూడు నియోజకవర్గాల్లో 3,17,268 మంది పురుషులు, 3,36,323 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
పెద్దపల్లి జిల్లా..
పెద్దపల్లి జిల్లాలో మొత్తం 6,68,668 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,35,251, మహిళలు 3,33,372, ఇతరులు 45 మంది ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో మొత్తం 2,12, 328 మంది ఓటర్లు కాగా, పురుషులు 1,07,613, మహిళలు 1,04,682, ఇతరులు 33 మంది ఉన్నారు. మంథని నియోజకవర్గంలో మొత్తం 2,19, 120 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,09,014, మహిళలు 1,10,101 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 2,37,220 మంది ఓట ర్లుండగా, పురుషులు 1,18,589, మహిళలు 1,18,589, ఇతరులు ఏడుగురు ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 4,40,206 మంది ఓటర్లుండగా, పురుషులు 2,14,654, మహిళలు 2,25,549, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఇందులో కొత్త ఓటర్లు 3,102 మంది ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం 2,31,493 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,13,704, మహిళలు 1,17, 788, ఇతరులు ఒకరు ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో మొత్తం 2,08,713 ఓటర్లు కాగా, పురుషులు 1,00,950, మహిళలు 10,7,761, ఇతరులు ఇద్దరు ఉన్నారు.