ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తాం
అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్
కరీంనగర్ రూరల్, డిసెంబర్ 3: రైతులు అధైర్యపడొద్దని, పండించిన వరి ధాన్యం కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ భరోసా ఇచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ గ్రామంలో కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్రాల్లోని మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని , రైతులు తేమశాతం 17 కంటే తక్కువగా ఉండేలా చూడాలని సూచించారు. సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, పలు సమస్యలు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సివిల్ సప్లయ్ డీ ఎం శ్రీకాంత్‌రెడ్డి, కరీంనగర్ రూరల్ ఆర్ఐ రజినీకాంత్‌రెడ్డి, సీఈవో రమేశ్, సింగిల్ విండో డైరెక్టర్ సాయిల మహేందర్, మాజీ ఎంపీటీసీ వరి భద్రయ్య, లక్ష్మయ్య, రైతులు పాల్గొన్నారు.