సుల్తానాబాద్/ సుల్తానాబాద్‌రూరల్, నవంబర్ 3: ‘దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం చెప్పింది..అయినా తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతాంగానికి అండగా నిలుస్తుంది’ అంటూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం సుల్తానాబాద్ బల్దియా, మండలంలోని సుగ్లాంపల్లి, పూసాల, శాస్త్రీనగర్, సుల్తానాబాద్, సుద్దాల, కందునూరిపల్లి, కోమండ్లపల్లి, నీరుకుళ్ల, గట్టేపల్లి, కదంబాపూర్, రేగడిమద్ధికుంటల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయాచోట్ల కొంతసేపు ధాన్యాన్ని తూకం వేశారు. రైతులతో ముచ్చటించి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారని చెప్పారు. రైతులు నిబంధనల మేరకు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమాల్లో సుల్తానాబాద్ బల్దియా చైర్పర్సన్ సునీత, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, సుల్తానాబాద్, సుద్దాల విండోల చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్, మహిపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్‌గౌడ్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, సర్పంచులు పన్నాల స్వరూప, కోటగిరి విజేందర్, కొలిపాక అరుణజ్యోతి, కోడెం సురేఖ, కాసర్ల అంజలి, ఎంపీటీసీలు సంపత్, శంకర్, రాజమణి, సుద్దాల విండో వైస్ చైర్మన్ ఢిల్లీశ్వర్రావు, ఉప సర్పంచులు కొమురయ్య, నిర్మల, మాధవరావు, రాజు, నేతలు చంద్రయ్య, వీరయ్య, సంపత్, కనుకయ్య, వెంకటరమణారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, స్వామి, సీఈవోలు సంతోష్, సతీశ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీతరమేష్గౌడ్, ఎంపీపీ పోన్నమనేని బాలాజీరావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్‌గౌడ్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి సతీష్‌కుమార్, ఏవో డేవిడ్‌రాజ్, నాయకులు ముత్యం రమేశ్, పారుపెల్లి గుణపతి, గుర్రాల శ్రీనివాస్, రెవెల్లి తిరుపతి, పొన్నం చంద్రయ్య, వల్స నీలయ్య, సంజీవరెడ్డి, సర్వర్, గెల్లు ముత్యాలు, వెయికండ్ల నరేందర్, వేగోళం రవీందర్, తోట వెంకటేశ్, ఎండీ వాహీద్, గాజుల ఆరుణ్ పాల్గొన్నారు.