మల్యాల/ కొడిమ్యాల నవంబర్ 3: కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలతో రైతాంగానికి తీరని నష్టం జరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. రైతుల మోటర్లకు మీటర్లు పెడితే ఊరుకోబోమని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బుధవారం ఎమ్మెల్యే మల్యాల, తాటిపల్లి, లంబాడిపల్లి, ముత్యంపేట. పోతారం, రామన్నపేట, మద్దుట్ల, నూకపల్లి, కొడిమ్యాల మండలం అప్పారావుపేట,పూడూర్ చెప్యాల రామకిష్టాపూర్ కొడిమ్యాల నల్లగొండ,నాచుపల్లి తిప్పాయపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఊరూరా ధాన్యం సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతులు శుద్ధి చేసిన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మల్యాల మండలం రామన్నపేటకు చెందిన రియాజ్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు. అతడి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మల్యాలలో తహసీల్దార్ సుజాత, ఐకేపీ ఏపీఎం చిన్న రాజయ్య, జడ్పీ కోఆప్షన్ సుభాన్, సర్పంచ్ల ఫోరం మండ లాధ్యక్షులు మిట్టపల్లి సుదర్శన్, మల్యాల, నూకపల్లి, పోతారం ఫ్యాక్స్ అధ్యక్షులు ముత్యాల రాంలింగారెడ్డి, బోయినిపల్లి మధుసూదన్‌రావు, అయిల్నేని సాగర్‌రావు, మండల కోఆప్షన్ సభ్యుడు అజహర్, సర్పంచ్‌లు బింగి జ్యోష్న, కట్కూరి తిరుపతి, బద్దం తిరుపతిరెడ్డి, రాసమల్ల హరీశ్, గడ్డం జలజ, కెల్లేటి మల్లమ్మ, ఎంపీటీసీ సభ్యులు పోతాని రవి, షఫియాభేగం, దొంగ అనిత, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, కొడిమ్యాలలో జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, విండో చైర్మన్లు మేన్నేని రాజనర్సింగారావు, బండ రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, సర్పంచ్‌లు పెద్ది కవిత , ఉట్కూరి రాజశేఖర్‌రెడ్డి, ఏలేటి మమత, గుంటి లక్ష్మిదేవ్వ, అంబటి లత, పిల్లి మల్లేశం, మ్యాకల లత, గరిగంటి మల్లేశం, ఎంపీటీసీ ఉట్కూరి మల్లారెడ్డి, చీకట్ల సింధు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, ఏపీఎం దేవరాజం, సింగిల్ విండో సీఈవోలు వొడ్నాల గంగాధర్, రాజేందర్‌రెడ్డి, అర్బీఎస్ మండలాధ్యక్షుడు అంకం రాజేశం, నాయకులు అంబటి తిరుమలేశ్, చీకట్ల మహేందర్,పెద్ది రవి,గోగూరి నాగ భూషణ్‌రెడ్డి, గుంటి తిరుపతి, బండ నర్సింహరెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, కోరండ్ల నరేందర్‌రెడ్డి ఉన్నారు.