మంథని రూరల్/మంథని టౌన్, నవంబర్ 3: కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనమన్నా తెలంగాణ ప్రభుత్వం సై అంటూ వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టిందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. మండలంలోని ఎక్లాస్పూర్, గోపాల్పూర్, పట్టణంలోని గంగాపురి, పవర్‌హౌస్ కాలనీల్లో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ వేర్వేరుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతులకు మరింత నష్టం వాటిల్లేలా కొత్త చట్టాలను, పథకాలను తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతులకు ఎక్కడ ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సైతం గ్రామంలో వరి ధాన్యం సేకరణపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన ఉడుత లింగయ్యకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు రూ. 54వేలను లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండి ప్రకాశ్, ప్యాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత, ఏఎంసీ చైర్మన్ శ్రీరాంభట్ల సంతోషిణి, ఆర్బీఎస్ అధ్యక్షుడు ఆకుల కిరణ్, సర్పంచులు చెన్నవేన సదానందం, సుజాత, కనవేన శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపెల్లి కుమార్, వైస్ ఎంపీపీ కొమ్మిడి స్వరూప్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బెల్లంకోండ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీటీసీ పెండ్లి చైతన్య, మిరియాల ప్రసాద్‌రావు, తొంబూరపు సుజాత తిరుపతి, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్, యూత్ అధ్యక్షుడు కొండ రవీందర్, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు ఎక్కెటి అనంతరెడ్డి, డైరెక్టర్లు గొబ్బూరి వంశీ, రాజు గౌడ్, ఆకుల బాపు, లెక్కల కిషన్ రెడ్డి, వేల్పుల గట్టయ్య, లంభు ప్రభాకర్ రెడ్డి, దాసరి లక్ష్మి, రావికంటి సతీశ్‌కుమార్, ఓదేలు, మున్సిపల్ కౌన్సిలర్స్ విజయలక్ష్మి, శ్రీపతి బానయ్య, వీకే రవి, నక్క నాగేంద్ర, ఏఓ అనూష, ఆర్ఐలు అమృత్ కుమార్, రాజబాపు, పలువురు ఉన్నారు.