చేనేత కార్మికులకు బీజేపీ ఏం చేసింది?
విమర్శించడం కాదు ఏం చేశారో చెప్పండి?
ఓట్లడిగే నైతిక హక్కు మీకు లేదు
బెంగాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది
హుజూరాబాద్‌లో గెల్లు గెలుస్తడు
కేంద్రమంత్రులు వచ్చినా.. మోకాళ్ల యాత్రలు చేసినా మా గెలుపును ఆపలేరు
ఈటల నీ సిద్ధాంతమేంటి?
హుజూరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు
కరీంనగర్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : చేనేత కార్మికుల కోసం కేంద్రంలో ఉన్న పథకాలను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బీజేపీ పథకాలు రద్దు చేసినా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వాటిని కొ నసాగించారని తెలిపారు. టీ ఆర్ఎస్ హయాంలోనే నేత కార్మికుల బతుకుకు భద్రత ల భించిందన్నారు. కేంద్ర మం త్రులు ఎందరు వచ్చినా, బీజే పీ నాయకులు మోకాళ్ల మీద యాత్రలు చేసినా హు జూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. హుజూరాబాద్ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. జమ్మికుంటలో నిర్వహించిన పద్మశాలీ సదస్సులో బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చేనేత కార్మికులు బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలో సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశాలు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదని, బీజేపీ ప్ర భుత్వం చేయూతనిచ్చేందుకు ఏం చేసిందో చెప్పాలన్నారు. అసలు ఓట్లు అడిగే నైతిక హ క్కు ఆ పార్టీ నాయకులకు లేదని స్పష్టం చేశారు. ఊకదంపుడు ఉపన్యాసాలు, పసలేని విమర్శలు చేనేత కార్మికుల కడుపు నింపవన్నారు.
గతంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా హ్యాండ్ల్లూం బోర్డు ను, ఆల్ ఇండియా హ్యాండ్ క్రాఫ్ట్, త్రిఫ్ట్‌లో కార్మికులకు ఇచ్చే నాలుగు శాతం వాటాను, మార్కెట్ ఇన్సెంటివ్ పథకాన్ని, హౌస్ కం వర్క్‌సైడ్ పథకాన్ని, మహాత్మాగాంధీ బుక్కా బీమా, ఐసీఐసీఐ లూంబా ఆరోగ్య బీమా వంటి పథకాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. అలాంటి పార్టీని హుజూరాబాద్ నియోజకవర్గంలో రద్దు చేయాలని చేనేత కార్మికులకు మంత్రి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత నేత కార్మికులకు ఒక భరోసా వచ్చిందని, కనీస వేతనాలు పొందగలుగుతున్నారని, పూర్తి స్థాయిలో వారికి భద్రతను కల్పించింది సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆరే అని చెప్పారు. త్రిఫ్ట్ పథకంలో 4 శాతం వాటాను కేంద్రం రద్దు చేసిందని, అయినా రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం 16 శాతం అందించి నేతన్నకు చేయూత పథకాన్ని తెచ్చిందన్నారు. నూలు మీద 40 శాతం రాయి తీ, కార్మికులకు ఆధునిక పరికరాలు, పావలా వడ్డీకి రుణాలు ఇస్తున్నదని, కనీస వేతనాలు వచ్చేలా చేసిందని చెప్పారు.
కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న పథకాలను ఊడగొట్టి, చేనేత కార్మికుల నోట్లో మట్టిగొట్టిందని, అలాం టి పార్టీకి ఓట్లడిగే నైతిక హక్కే లేదని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకత వస్తున్నదని, పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి చిత్తు చిత్తుగా ఓడించిందని చెప్పారు. నేత కార్మికులు ఇప్పుడు టీఆర్ఎస్ వైపు, సీఎం కేసీఆర్ వైపు ఉన్నారని, తమ పార్టీ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించబోతున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారన్నారు. టీఆర్ఎస్ గెలుపుతోనే హుజూరాబాద్ అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం ముడిపడి ఉందని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా అపూర్వమైన ఆదరణ లభిస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని, ఆయన అమలు చేస్తున్న పథకాలు చూ సి ప్రతిపక్ష నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.