హరిత తెలంగాణే లక్ష్యంగా హరితహారం
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
ఎమ్మెల్యే సుంకెతో కలిసి కేసీఆర్ వనం పరిశీలన
వన సంరక్షణపై అటవీ అధికారులకు అభినందనలు
చొప్పదండి, జనవరి 3: వెదురుగట్టలోని కేసీఆర్ వనం అద్భుతంగా ఉందని, ఈ వనం అభయారణ్యంగా మారుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. వెదురుగట్ట కేసీఆర్ వనాన్ని సోమవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆయన సందర్శించారు. అక్కడ నాటిన మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, అటవీ విస్తీర్ణం తగ్గిన తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారన్నారు. ఇందులో భాగంగా నాటిన మొక్కలతో తెలంగాణ ప్రాంతం హరితమయంగా మారిందని చెప్పడానికి ఉదాహరణే కేసీఆర్ వనమని పేర్కొన్నారు. 172 ఎకరాల్లో నాటిన మొక్కలను సంరక్షిస్తూ మహారణ్యంగా మారుస్తున్న ఫారెస్ట్ అధికారులను ఆయన అభినందించారు. అనంతరం మొక్కలు నాటారు. అంతకుముందు గ్రామానికి చెందిన రైతు బంధు సమితి మండల కన్వీనర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి తల్లి అనారోగ్యంతో మృతిచెందగా ఆ కుటుంబాన్ని వినోద్‌కుమార్ పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో చైర్మన్లు వీర్ల వెంకటేశ్వర్రావు, రాజనర్సింహారెడ్డి, వ్యవ సాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, మాజీ ఎంపీపీలు గుర్రం భూమారెడ్డి, వల్లాల కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు గుంట రవి, సురేశ్, నాయకులు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్, నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మచ్చ రమేశ్, మహేశుని మల్లేశం, దండె కృష్ణ, మావూరం మహేశ్, దండె కృష్ణ, మణిశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.