వీణవంక, అక్టోబర్ 2: స్వరాష్ట్రంలోనే గొల్ల కురుమలకు గుర్తింపు వచ్చిందని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం పేర్కొన్నారు. వీణవంక మండలం రామకృష్ణాపూర్, వీణవంక గ్రామా ల్లో టీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి ఆయన శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకూ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం వీణవంకలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలేదని, దీంతో దుర్భర జీవితాలను గడిపారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. గొల్ల, కురుమల కోసం సీఎం కేసీఆర్ రూ.11వేల కోట్లు కేటాయించారని, పిల్లల భవిష్యత్తు కోసం ఉచిత విద్యను అందిస్తూ.. హాస్టళ్లను నిర్మిస్తున్నారని తెలిపారు. చుక్క నీరు లేక ఒకప్పుడు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్, చెక్‌డ్యాముల నిర్మాణంతో నీరు సమృద్ధిగా లభిస్తున్నదని తెలిపారు. ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒగ్గుడోలు వాయిస్తూ ప్రచారం కొనసాగించారు. కురుమ సంఘం నాయకులు ఎమ్మెల్సీకి గొంగడి కప్పి సన్మానించారు. కోర్కల్ గ్రామానికి చెందిన చీర సదానందం అనారోగ్యానికి గురికాగా.. అతడిని పరామర్శించిన ఎమ్మెల్సీ ఆర్థికసాయం అందజేశారు. కురు మ సంఘం జిల్లా అధ్యక్షుడు మీస వీరయ్య, సర్పంచులు నీల కుమారస్వామి, మర్రి వరలక్ష్మీస్వామి, మ్యాకల సమ్మిరెడ్డి, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సంపత్, యూత్ అధ్యక్షుడు అరుణ్‌కుమార్, మండలాధ్యక్షుడు నీల పున్నం చందర్, నాయకులు నీల కుమార్, గోపు సదానందం, మంత్రి రవి, అమృత ప్రభాకర్, నితిన్, రాజయ్య, నాగేశ్, అకోశ్, యార రమేశ్ తదితరులు పాల్గొన్నారు.