ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ
పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, నాయకులు
కార్పొరేషన్, సెప్టెంబర్ 2: నగరంలోని 60 డివిజన్లలో గురువారం టీఆర్ఎస్ జెండా పండుగను మేయర్‌తో పాటు పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల డప్పుచప్పుళ్లు, పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి వేడుకలు జరుపుకొన్నారు. ఆయా డివిజన్లలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ జెండా ఆవిష్కరించగా… పార్టీ కార్పొరేటర్లు లేని ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జెండా ఆవిష్కరించారు. కాగా, 33వ డివిజన్లో తెలంగాణ తల్లి చిత్రపటం మేయర్ వై సునీల్‌రావు కొబ్బరికాయ కొట్టి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వాడవాడలా జెండా పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని, టీఆర్ఎస్ను బలపరుస్తూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, యువకులు, వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 37వ డివిజన్లో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్ పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్, రాజు, శ్రీనివాస్, మురళీ, రవి తదితరులు పాల్గొన్నారు. 42వ డివిజన్లోని మంత్రి గంగుల కమలాకర్ మీసేవా క్యాంపు కార్యాలయం వద్ద కార్పొరేటర్ మేచినేని వనజాఅశోక్రావు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఆయా డివిజన్లలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ జెండా ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, చాడగొండ బుచ్చిరెడ్డి, లెక్కల స్వప్నావేణు, సుధగోని మాధవీకృష్ణ, గంట కళ్యాణి, గందె మాధవి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్పొరేషన్, సెప్టెంబర్ 2: టీఆర్ఎస్ జెండా పండుగను పురసరించుకుని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం నుంచి జీకే యూత్ అధ్యక్షుడు మోగిలోజు వెంకట్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని టీఆర్ఎస్ నాయకుడు చల్లా హరిశంకర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యాలయం నుంచి నగర ప్రధాన రహదారుల మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కర్ర సూర్యశేఖర్, పొన్నం రాజు, బట్టు వరప్రసాద్, జీకే యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, సెప్టెంబర్ 2: మండలంలోని ఆసీఫ్‌నగర్‌లో ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్, కొత్తపల్లి 7వ వార్డులో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మల్కాపూర్‌లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్‌గౌడ్, గ్రామాల్లో పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ పిట్టల కరుణారవీందర్, టీఆర్ఎస్ నాయకులు గాలిపల్లి రవీందర్, చట్టు శ్రీనివాస్, ఉలివెందుల శేఖర్, బోనాల శంకర్, బోనాల రాజు, ఒల్లాల మల్లయ్య, తాండ్ర శ్రీనివాస్, సాబీర్, సర్పంచులు కడారి శాంతాశ్రీనివాస్, జింక సంపత్, గుట్ట జ్యోతి, వెల్దండి షర్మిలాప్రకాశ్, రాచమల్ల మధు, ఎంపీటీసీలు దావ కమలామనోహర్, కొమ్ము హేమలతారవికిరణ్, మంద రమేశ్, భూక్యా తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 2: 52 డివిజన్ ముకరంపుర చౌరస్తాలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. 30వ డివిజన్ మారుతీనగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు నేతికుంట హరీశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా కార్పొరేటర్ యాదయ్య టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. మహ్మద్ మజీద్ అలీ, టీఆర్ఎస్ నాయకులు అఫ్జలొద్దీన్, మహ్మద్ సాదిక్, షాబజ్, ఇసాక్ ఖాలీద్ అహ్మద్, యూత్ క్లబ్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 2: 8వ డివిజన్(అల్గునూర్)లో కార్పొరేటర్ సల్ల శారదారవీందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు జాప శ్రీనివాస్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. కేడీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామి రెడ్డి, ఆర్బీఎస్ కో-ఆర్డినేటర్ కంది రాంచంద్రారెడ్డి, నాయకులు సల్ల మహేందర్, బొల్లాడి నర్సింహారెడ్డి, జాప రాఘవరెడ్డి, పురంశెట్టి అనోహర్, పడాల రమేశ్, దాసం కమలాకర్, జేవీ మల్లారెడ్డి, జాప లక్ష్మారెడ్డి, పాకాల మల్లారెడ్డి, సల్ల జితేందర్, యాస్వాడ శ్రీకాంత్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
విద్యానగర్, సెప్టెంబర్ 2: 19వ డివిజన్లో టీఆర్ఎస్ జెండాను కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్ ఆవిష్కరించారు. పార్టీ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.