నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
టీఆర్ఎస్లో బీజేపీ నాయకుల చేరిక
వీణవంక, సెప్టెంబర్ 2: అన్నం పెట్టి రాజకీయ ఓనమాలు నేర్పిన సీఎం కేసీఆర్‌ను విమర్శించే అర్హత బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో గురువారం బేతిగల్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరగా ఆయన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడం శుభపరిణామమని తెలిపారు. ఆనాడు పిడికెడు మందితో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైందని, నేడు కోట్లాది మందికి అభివృద్ధి ఫలాలు అందించే రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. ఈటల కంటే గొప్ప ఉద్యమకారులు టీఆర్ఎస్లో లక్షల మంది ఉన్నారని, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు గురించి ఆయన మాట్లాడడం ఆత్మవంచనేనని అన్నారు. ఈటల బీజేపీలో చేరినా హుజూరాబాద్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తున్నారని తెలిపారు. ఈటల అవకాశవాద రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, పచ్చని పల్లెల్లో బీజేపీని తీసుకురావడం నీ వ్యక్తిగత స్వార్థం కాదా అని ప్రశ్నించారు?. పదేళ్లుగా టీఆర్ఎస్ను బలోపేతం చేయకుండా.. వ్యక్తిగత ప్రయోజనం కోసం పని చేశారని అన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచాక కులమత విధ్వేషాలు రెచ్చగొట్టడం తప్ప హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏం చేయలేదని ఎద్దేవా చేశారు. భూములపై టీఆర్ఎస్ హక్కులు కల్పించిందని, బీజేపీ గెలిస్తే ఆ హక్కులు పోతాయని ఈ ప్రాంత రైతులు, రైతు కూలీలు ఆలోచన చేయాలని కోరారు.
రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ ఆవిర్భావం
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ ఆవిర్భవించిందని, అందరినీ ఏకం చేసి సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచిన నేత సీఎం కేసీఆర్ అని, దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం అవతరించిందన్నారు. ప్రభుత్వ సుస్థిరతను దెబ్బ తీసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని, ఈటల రాజేందర్ ఒక్కో రోజు ఒక్కో స్టేట్మెంట్ ఇస్తున్నారని అన్నారు. ఈటల గతంలో చేసిన అభివృద్ధి.. గెలిస్తే చేసే అభివృద్ధిని గురించి చెప్పాలి గానీ, అడ్డుగోలుగా సవాళ్లు విసురుతున్నారని విమర్శించారు. ఈటల మాట తన ముర్ఖత్వానికి నిదర్శమని, ఈటల వ్యక్తిగత సవాళ్లు, నిందెలకు దిగడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రధాని మోదీకి, బీజేపీ పార్టీకి ఇష్టం లేదని, అలాంటి పార్టీలో చేరిన ఈటల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ వనమాల-సాధవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లత-శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు హమీద్, నాయకులు భానుచందర్, నర్సయ్య, శ్రీదేవి, గెల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.