15 నుంచి 18 ఏండ్లలోపు వారికి వ్యాక్సినేషన్
పీహెచ్‌సీల్లో అన్ని ఏర్పాట్లు
వెల్లడించిన వైద్యాధికారులు
మానకొండూర్ రూరల్, డిసెంబర్ 2: మండలంలోని లక్ష్మీపూర్ (వెల్ది) పీహెచ్సీ పరిధిలో సోమవారం నుంచి 15 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలకు టీకాలు వేయనున్నామని డాక్టర్ బియాబాని తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆదివారం 20 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందన్నారు. లక్ష్మీపూర్, వెల్ది, పచ్చునూర్, వేగురుపల్లి, లింగాపూర్, దేవంపల్లి తదితర గ్రామాల్లో 116 మందికి వాక్సిన్ వేశామని పేర్కొన్నారు. పిల్లలు టీకాలు వేసుకునేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయా గ్రామాల్లో ని ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు అన్నపూర్ణ, ఎండీ జుబేర్, ఎల్డీ కంప్యూటర్ ఎండీ ఇజాజ్, సిబ్బంది ఉన్నారు.
శంకరపట్నం పీహెచ్సీలో..
శంకరపట్నం, జనవరి 2: 15-18 సంవత్సరాల పిల్లలకు శంకరపట్నం పీహెచ్సీలో సోమ వారం కొవిడ్ టీకా వేస్తున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ షాకీర్ అహ్మద్ వెల్లడించారు. ఆదివారం పీహెచ్సీ వైద్యాధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. పిల్లలకు, ఇతర వయసుల వా రికి వేర్వేరుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. 15-18 వయస్సు గల పిల్లలు ఆధార్ లేదా స్టూడెంట్ ఐడీ కార్డ్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 2వ డోస్ 28 రోజుల తర్వాత వేయనున్నట్లు చెప్పారు. టీడీ, టైఫాయిడ్, ఏఆర్వీ తదితర వ్యాక్సిన్లు తీసుకున్నవారు ఆ తేదీ నుంచి 4 వారాల తర్వాత కరోనా టీకా తీసుకోవచ్చని వెల్లడించారు. ప్రికాషన్ డోస్ జనవరి 10 నుంచి ప్రారంభమవుతాయని తెలిపా రు. హెచ్‌సీవీ, ఎఫ్‌ఎల్‌డబ్ల్యూ, 60 ఏండ్లు దా టిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రికాషన్ డో స్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 2వ డోస్ తర్వాత 6 నెలలు దాటిన వారు అర్హులని తెలిపారు. టీకా పేరు త్వరలో ప్రభుత్వం వెల్లడిస్తుందని తెలిపారు. కొవిడ్ వ్యాధి వచ్చి తగ్గిన వారు 3 నెలల తర్వాత టీకా తీసుకోవచ్చని చెప్పారు.
చిగురుమామిడిలో..
చిగురుమామిడి, జనవరి 2: పిల్లలకు మం డల ఆరోగ్య కేంద్రంలో సోమవారం నుంచి టీకా లు వేయనున్నామని మండల వైద్యాధికారి నాగశేఖర్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పిల్లలు ఆరోగ్య కేంద్రానికి రావాలన్నారు. టీకా వేసుకున్న అర్ధ గంట వరకు వ్యాక్సిన్ కేంద్రంలోనే ఉండాలన్నారు. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లయితే డాక్టర్ పర్యవేక్షణ లో చికిత్సకు ఏర్పాట్లు చేశామన్నారు. చిగురుమామిడిలో సోమవారం ఉదయం ఎంపీపీ కొత్త వినితా శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామన్నారు.