సారంగాపూర్, నవంబర్ 1: రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకొని టీఆర్ఎస్ను ఓడించాలని కుట్రలు పన్నుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఆ పార్టీలు నైతిక విలువలు కోల్పోతున్నాయని, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కల్యాణ మండపం ఆవరణలో పార్టీ అధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్‌లో నవంబర్ 15 న నిర్వహించే విజయగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి ఒక బస్సును ఏర్పాటు చేశామని, నూతనంగా ఎన్నికైన పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు, కార్యవర్గ సభ్యులు తప్పనిసరిగా విజయగర్జన సభకు తరలిరావాలని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గ్రామగ్రామాన పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు, కమిటీల సభ్యులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కమిటీలదేనని సూచించారు. అంతకుముందు మండలంలోని కోనాపూర్ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, అర్పల్లిలో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు కొనుగోలు కేంద్రాలను, లక్ష్మీదేవిపల్లిలో సీసీ రోడ్డు, పల్లెప్రకృతి వనం, డంప్ యార్డ్, కంపోస్ట్ షెడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కోల శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి తోడేటి శేఖర్ గౌడ్, మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ, సోషల్ మీడియా, యువజన విభాగాల అధ్యక్షులు మల్యాల జలపతి, పంగ విజయ్, భుక్య సంతోష్, దూలూరి వంశీ, సిలివేరి మదన్, సింగిల్ విండో చైర్మన్లు గురునాథం మల్లారెడ్డి, ఏలేటి నర్సింహారెడ్డి, ప్రజాప్రతినిధులు ఢిల్లీ రామారావు, జోగినపెల్లి సుధాకర్ రావు, అర్రె లక్ష్మి, కొత్తురి రాజేశ్వరి, శ్రీలత, వెంకటరమణరావు, పల్లపు వెంకటేశ్, సయ్యద్ అమీర్, భూక్యా లావణ్య రాథోడ్, రాచకొండ రాజేశం, లక్ష్మి, మమత, నాయకులు సాగి సత్యం రావు, ఎడమల లక్ష్మారెడ్డి, గంగారెడ్డి, గోపాల్, రాజిరెడ్డి. రమేశ్, శ్రీనివాస్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, కమిటీల సభ్యులు పాల్గొన్నారు.