సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన
అడుగడుగునా అమాత్యుడికి ఘన స్వాగతం
8.45కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..
ప్రజలు, నాయకులకు పలుకరింపులు
మల్లారెడ్డిపేటలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ
మాఘమాస, గంగాభవానీ, శ్రీమడేలయ్యేశ్వర స్వామి జాతరలకు హాజరు
ప్రజలు సుఖశాంతులతో ఉండాలి: కేటీఆర్
సిరిసిల్ల/గంభీరావుపేట, ఫిబ్రవరి 1: ప్రజా సంక్షేమం.. ప్రగతే ధ్యేయంగా పనిచేసే మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో అలుపెరుగని యాత్ర చేశారు. జిల్లా కేంద్రంతోపాటు గంభీరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. అంతకుముందు పార్టీ శ్రేణులు, నాయకులు ఆయనకు అడుగడుగునా స్వాగతం పలుకగా, పలుచోట్ల 8.45కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ, దారివెంట నాయకులు, ప్రజలను ఆప్యాయంగా పలుకరించారు. అలాగే మాఘమాసం సందర్భంగా మల్లారెడ్డిపేట వీరాంజనేయ, గంగాభవానీ, శ్రీమడేలయ్యేశ్వరస్వామి, శ్రీరామలింగేశ్వరస్వామి జాతర్లలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, పాడిపంటలతో సుభిక్షం రావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. గంభీరావుపేట మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు మాఘమావాస్య సందర్భంగా ముందుగా పలు జాతర్లలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:12 గంటలకు జిల్లా సరిహద్దులోని పెద్దమ్మ అటవీ ప్రాంతంలో మంత్రి కేటీఆర్‌కు మండల టీఆర్ఎస్ నేతలు బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:47 గంటలకు గంభీరావుపేటలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 1:45 గంటలకు మల్లారెడ్డిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మల్లారెడ్డిపేటలో భోజనం చేసిన అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు మల్లారెడ్డిపేటలో జరిగే మాఘమాస జాతరలో పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:05 గం టలకు సిరిసిల్లకు చేరుకుని మానేరులో జరిగే జాతర ఉత్సవాలకు హాజరయ్యారు. శ్రీమడేలయ్యేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి ని దర్శించుకున్నారు. అనంతరం మానేరు వాగులోని గంగభవానీ ఆలయానికి చేరుకొని అమ్మవారలకు పూజలు చేసి, బైపాస్‌రోడ్డులోని రామప్ప ఆలయంలో పూజలు చేశారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, రా ష్ట్రం పచ్చని పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.
జిల్లా సరిహద్దులో ఘనస్వాగతం..
అమాత్యుడి పర్యటన సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్వర్యంలో జిల్లా సరిహద్దులోని పెద్దమ్మ స్టేజీ వద్ద మంత్రి కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందించారు. అక్కడే జిల్లా అదననపు కలెక్టర్ ఖీ మ్యానాయక్, జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు ఎలుసాని ప్రవీణ్‌కుమార్‌లు మంత్రిఇని కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చారు. సిరిసిల్లలోని మడేశ్వరస్వామి, గంగభవానీ, రామప్ప ఆలయాల వద్ద మహిళలు మంగళహారతులతో మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలికారు. ఆలయాలకు వచ్చిన భక్తులను పలుకరిస్తూ, అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు.
అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమిపూజ
గంభీరావుపేటలోని కాకులగుట్ట వద్ద రైతువేదికకు సమీపంలో 50లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించే అంబేద్కర్ సంఘ భవన నిర్మాణానికి కేటీఆర్ భూమిపూజ చేశారు. అనంతరం అంబేద్కర్ సంఘ నేతలతో మాట్లాడారు. అలాగే మల్లారెడ్డిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్, జడ్పీచైర్‌పర్సన్ అరుణ, నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్‌రావుతో కలిసి ఆవిష్కరించారు. మంత్రికి మల్లారెడ్డిపేటలో అంబేద్కర్సంఘ నేతలు డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా జై భీమ్ అంటూ నినదించారు
మల్లారెడ్డిపేటలో 7.95కోట్ల పనులకు శంకుస్థాపన
మల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్ 7.95 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మల్లారెడ్డిపేట-గంభీరావుపేట మధ్యలోని మానేర్వాగుపై 7.50కోట్లతో నిర్మించనున్న హైలెవల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 20లక్షల సీడీపీ నిధులతో గ్రామంలో నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి, రూ.25లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ముస్తాఫాన గర్‌లో రూ.5లక్షలతో ముదిరాజ్ సంఘ భవ నానికి శంకుస్థాపన చేశారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ అరుణ, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, గ్రంథాలయ చైర్మన్ శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఖీ మ్యా నాయక్, ఆర్డీవో శ్రీనివాసరావు, ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ముస్తాబాద్ మండల ఆర్బీఎస్ కన్వీనర్ గోపాల్‌రావు, ముస్తాబాద్ జడ్పీటీసీ గుం డం నర్సయ్య గంభీరావుపేట సర్పంచ్ శ్రీధర్, మల్లారెడ్డిపేట సర్పంచ్ శెట్టి మహేశ్వరి, సెస్ మాజీ డైరెక్టర్లు విజయరామరావు, కుంభాల మహేందర్‌రెడ్డి, ముస్తాబాద్ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బోంపల్లి సురేందర్‌రావు, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్ ఉన్నారు.