అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి
చీర్లవంచలో సీనియర్ సిటిజన్లకు కర్రలు, స్వెట్టర్లు అందజేత
సిరిసిల్ల రూరల్, జనవరి 1: సీనియర్ సిటీజన్లకు సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నామని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో సీనియర్ సిటిజన్లకు లయన్స్ క్లబ్ ఆఫ్ శాతవాహన కరీంనగర్ ఆధ్వర్యంలో శనివారం స్వెట్టర్లు, చేతి కర్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అల్ఫోర్స్ చైర్మన్ వీ నరేందర్‌రెడ్డి, లయన్ క్లబ్ జిల్లా గవర్నర్ నాగుల సంతోష్‌గౌడ్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 40మంది సీనియర్ సిటిజన్లకు చేతికర్రలు, స్వెట్టర్లు, హ్యాండ్ గ్లౌస్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చీర్లవంచ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి కృషి చేస్తామన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులను నియమిస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లకు సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. తనను ఆహ్వానించిన టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నరేంద్‌రెడ్డి, నాగుల సంతోష్‌కు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. ఇక్కడ సర్పంచ్ జక్కుల రవీందర్, ఎంపీటీసీ నలువాల రేణుక, ఉప సర్పంచ్ కొగిలంచ బ్రహ్మం, సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు వెంకటయ్య, భీమరి అంజయ్య, ప్రభాకర్‌రావు, మనువాడ మల్లేశం, బాబు, మహేశ్, కో ఆప్షన్ సభ్యులు కమలాకర్‌రావు, హనుమంతరావు ఉన్నారు.