వేములవాడ టౌన్/మల్యాల/ధర్మపురి జనవరి 1: ఉమ్మడిజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి నర్సింహస్వామి ఆలయాల్లో శనివారం భక్తుల రద్దీ కనిపించింది. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాం తాలను నుంచి అధికసంఖ్యలో తరలివచ్చారు. ప్రా తఃకాలం నుంచే క్యూలైన్లలో బారులు తీరి స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ ఏడాదంతా సకల శుభాలు కలుగాలని మొక్కుకున్నారు. రాజన్న అనుంబంధ ఆలయాలైన నగరేశ్వర, భీ మేశ్వర, బద్దిపోచమ్మ క్షేత్రాల్లోనూ భక్తుల సందడి కనిపించింది. సుమారు 15వేలమంది రాజన్నను దర్శించుకున్నారని ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు.
నృసింహుడి సన్నిధిలో హైకోర్టు రిజిస్ట్రార్
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారిని శనివారం రాష్ట్ర హైకోర్టు ప్రొటోకాల్ రిజిస్ట్రార్ శ్రీధర్‌రావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ఆలయ కమిటీ బాధ్యులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆశీర్వచన మండపంలో సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం అందజేసి ఘనంగా సన్మానించారు. ఇక్కడ ముఖ్య అర్చకులు రమణయ్య, అర్చకులు కిరణ్‌కుమార్ తదితరులున్నారు.