చిగురుమామిడి, జనవరి 1: 2022 నూతన సంవత్సర వేడుకలను మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు, యువకులు ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు, యువకులు కేక్ కట్ చేసి నృత్యం చేస్తూ సంబురాలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ దాస సుధాకర్ పోలీసుల సమక్షంలో కేక్ కట్ చేశారు. మండల కేంద్రం లోని క్రికెట్ టోర్నమెంట్ క్రీడామైదానంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి క్రీడాకారులతో కలిసి కేక్ కట్ చేశారు. మండలంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి పలు గ్రామాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి వాహనదారులపై కేసులు నమోదు చేశారు.
శంకరపట్నంలో..
శంకరపట్నం, జనవరి 1: మండలంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సంబురాలు చేసుకున్నారు. కేకులు కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మండలంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. తాడికల్లోని గౌడ కమ్యూనిటీ హాల్లో అయ్యప్ప దీక్షాపరులు పడిపూజ నిర్వహించారు. దీక్షాపరులు పేటతుళ్లి ఆడి తన్మయత్వంతో పరవశించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు.
మానకొండూర్‌లో..
మానకొండూర్ రూరల్, జనవరి 1: మండలంలోని గంగిపల్లి, వన్నారం, కొండపల్కల, చెంజర్ల, వెల్ది, ఊటూర్, రంగపేట, ముంజంపల్లి గ్రామాల్లో శనివారం ప్రజాప్రతినిధులు, చిన్నారులు, గ్రామస్తులు ముఖ్య కూడళ్లలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు. కేక్‌ను కట్ చేసి, స్వీట్లు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గంగిపల్లిలో ఏఎంసీ మాజీ చైర్మన్ వాల ప్రదీప్ రావు, మానకొండూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. నాయకులు దొమ్మాట పరశురాములు, మల్క సతీశ్ తదితరులు ఉన్నారు.
తిమ్మాపూర్‌లో..
తిమ్మాపూర్ రూరల్, జనవరి 1: మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు యువకులు, చిన్నారులు కుటుంబసభ్యులతో కలిసి నూతన సంవత్సన వేడుకలు ఘనంగా చేసుకున్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. చిన్నారులు, పెద్దలు మహిళలు ఆనందంగా గడిపారు.