జగిత్యాల, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): 20 ఏండ్ల కిందట ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. అనేక రికార్డులు సృష్టించి తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అభివర్ణించారు. వరంగల్‌లో నవంబర్ 15న నిర్వహించే విజయగర్జన సభ సన్నాహక సమావేశాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. హాజరైన పట్టణానికి చెందిన ముఖ్య కార్యకర్తలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. అంతకుముందు పార్టీ హాజరు పట్టికలో పేరు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 14 ఏండ్ల ఉద్యమంలో అనేక ఎత్తుపల్లాలు చూసిన టీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతాంగం అభ్యున్నతికి సర్కారు 24 గంటల ఉచిత కరెంట్, రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. అలాగే యాదవులకు గొర్రెల పంపిణీ, గంగపుత్రులకు చేపలు, వాహనాలు, స్విమ్ జాకెట్స్ పంపిణీ, ఆసరా పెన్షన్లు, ఆరోగ్యలక్ష్మి, కల్యాణలక్ష్మి, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు దుస్తుల పంపిణీ, షీ టీమ్స్, కేసీఆర్ కిట్, మహిళా గురుకులాలు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనన్నారు. జగిత్యాల వెనుకబాటుకు కాంగ్రెస్ నాయకులే కారణమన్నారు. ప్రస్తుతం పట్టణంలో రూ.50 కోట్లతో మిషన్ భగీరథ, డివైడర్లు, రూ.310 కోట్లతో 4500 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రూ.510 కోట్లతో వైద్యకళాశాల నిర్మిస్తున్నామన్నారు. కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయగర్జనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ దేశాయ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి, మహిళా అధ్యక్షురాలు కచ్చు లత, బీసీ కమిటీ లవంగ రాజేందర్, రైతు విభాగం బండారి నరేందర్, సోషల్ మీడియా పట్టణ కన్వీనర్ అలిశెట్టి వేణు, టీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు అరిఫ్, కార్మిక విభాగం తొలిప్రేమ శ్రీనివాస్, ఎస్టీ విభాగం శ్రీరామ్ భిక్షపతి, ఎస్సీ విభాగం పవన్ పాల్గొన్నారు.