లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
సారంగాపూర్, జనవరి 31: జగిత్యాల మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లబ్ధిదారుల ఇంటింటికీ బైక్‌పై వెళ్లి కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్. ఈ సందర్భంగా ఆయన ఆయాచోట్ల మాట్లాడారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నార న్నారు. సారంగాపూర్ మండలంలోని కోనాపూర్, పెంబట్ల, అర్పల్లి, లక్ష్మిదేవిపల్లి, సారంగాపూర్, బట్టపల్లి, పోతారం, రేచపల్లి, రంగపేట, ఒడ్డెరకాలనీ, నాగునూర్, లచ్చక్కపేట గ్రామాల్లో ఒక్క రోజే 52 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి ద్వారా మంజూరైన రూ.5.20కోట్లు, 30 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.10.87 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఇది చరిత్రలో ఎక్కడా లేదన్నారు. మంత్రి కేటీఆర్ కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను ఇంటికి వెళ్లిస్తే బాగుంటుందని సూచించడంతో మొన్న జగిత్యాల, రాయికల్‌లో ఇచ్చామన్నారు. ఈరోజు మండలంలో ఇంటింటింకీ తిరుగుతూ అందజేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్కు లబ్ధిదారులు తన దగ్గరకు వచ్చి దరఖాస్తులు ఇస్తే, తాను వారి ఇంటికి వచ్చి చెక్కులు అందజేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, వైస్‌ఎంపీపీ సొల్లు సురేందర్, కోఆష్షన్ సభ్యడు సయ్యద్ అమీర్, సింగిల్ విండో చైర్మన్లు ఏలేటి నర్సింహా రెడ్డి, గురునాథం మల్లారెడ్డి, ఎంపీడీవో వెంకటేశం, ఎంపీవో శశికుమార్ తహసీల్దార్ శ్రీలత, ఆర్ఐ జము, రైతుబంధు మండల కన్వీనర్ కోల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు ఆకుల జమున, బొడ్డుపెల్లి రాజన్న, పల్లికొండ రమేశ్, సంతోష్ నాయక్, కొండ శ్రీలత, పంపార్తి లక్ష్మి, గుర్రాల రాజేందర్ రెడ్డి, ఢిల్లీ రామారావు, అర్రెలక్ష్మి, జోగిన్‌పెల్లి సుధాకర్ రావు, ఎడమల జయ, అజ్మీరా శ్రీలత, భూక్యా లావణ్యారాథోడ్, భూక్యా అరుణ్ కుమార్, బుచ్చిమల్లు, బెక్కెం జమున, పల్లపు వెంకటేశ్, దమ్మ గంగు, వెంకటరమణారావు, తోడేటి శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.