ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్
జిల్లాలోని సీఐలు, ఎస్ఐలతో సమావేశం
రాంనగర్, జనవరి 31: గంజాయి, గుడుంబా, ఇతర మత్తు పదార్థాలను నిర్మూలించి మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా మద్య నిషేధ, ఆబారీ అధికారి కే చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా మద్య నిషేధ, ఆబారీ కార్యాలయం లో జిల్లాలోని ఐదు స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా చేస్తున్న వారిని ఎకడికకడ ఉకుపాదంతో అణిచివేయాలని సూచించారు. ప్రత్యేక బృందాలతో ఎవరెవరు మత్తు పదార్థాలకు బానిసలుగా మారారో గుర్తించాలన్నారు. తరచూ ఇలాంటి దందా చేసే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థల యాజమాన్యం, ప్రజా ప్రతినిధులతో అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మారెట్ ప్రాంతాల్లో దృష్టి సారించి గుడుంబా, గంజాయి, డ్రగ్స్‌తో కలి గే దుష్ఫలితాలను వివరించాలన్నా రు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పీ తాతాజీ, సీఐలు ఇంద్రప్రసాద్, చంద్రమోహన్, దుర్గాభవాని, తిరుమలత, ఎస్ఐలు చిరంజీవి, శ్రీనివాస్, శ్రీకాంత్, సరిత, రమ్య, కబీర్దాస్ తదితరులు పాల్గొన్నారు.