జమ్మికుంటలో రూ.9,800
కరీంనగర్ ఏఎంసీలో రూ.9,656
జమ్మికుంట, జనవరి 31: పత్తి ధర రోజురోజుకూ పెరుగుతున్నది. జమ్మికుంట కాటన్ మార్కెట్లో రూ.10వేలకు చేరువలో ఉన్నది. క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.9,800గా నమోదైంది. సోమవారం కాటన్ మార్కెట్‌కు రైతులు 109 వాహనాల్లో 1,063 క్వింటాళ్ల విడి పత్తిని తెచ్చారు. గరిష్ఠ ధర రూ.9,800, మోడల్ ధర రూ.9,700, కనిష్ఠ ధర రూ.8,500 పలికింది. అలాగే బ్యాగుల్లో 111 క్వింటాళ్ల కాటన్ రాగా, గరిష్ఠ ధర రూ.9,400, మోడల్ ధర రూ.9,200, కనిష్ఠ ధర రూ.4వేలతో వ్యాపారులు కొనుగోలు చేశారు. కొనుగోళ్లను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్‌కుమార్, ఇన్చార్జి కార్యదర్శి సుజన్‌బాబు, అధికారులు యాకయ్య, లక్ష్మణ్ పరిశీలించారు. వ్యాపారులు, అడ్తిదారులు, హమాలీలు, రైతులు, సిబ్బంది ఉన్నారు. కాగా, మంగళవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ బంద్ ఉంటుందని, బుధవారం రైతులు తమ ఉత్పత్తులను తీసుకురావాలని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి సుజన్‌బాబు తెలిపారు.
ముకరంపుర, జనవరి 31: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి ధర క్వింటాల్‌కు రూ.9,656 ధర పలికింది. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి 31మంది రైతులు 90క్వింటాళ్ల పత్తిని తీసుకురాగా వ్యాపారులు కొనుగోలు చేశారు. కనిష్ఠ ధర రూ.8,529 చెల్లించారు. ఇక మార్కెట్ పరిధిలోని మూడు జిన్నింగ్ మిల్లుల్లో 39మంది రైతుల నుంచి 416క్వింటాళ్లు ఖరీదు చేశారు. అత్యధికంగా క్వింటాల్‌కు రూ.9,650, అత్యల్పంగా రూ.7వేలు చెల్లించారు.