చిగురుమామిడి, ఆగస్టు 17: హరితహారంలో నిర్దేశించిన పనులు పూర్తి చేయాలని ఎంపీపీ కొత్త వినీత సూచించారు. మంగళవారం బొమ్మనపల్లి గౌడ కమ్యూనిటీ భవనం వద్ద తిమ్మాపూర్ ఎక్సైజ్ సీఐ ఇంద్రప్రసాద్తో కలిసి మొకలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఇప్పటికే అన్ని గ్రామాల్లో గుంతలు తవ్వి మొకలు నాటారన్నారు. ప్రస్తుతం హరితహారం లక్ష్యం చివరి దశకు చేరుకుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వ్యవసాయ భూముల వద్ద మాత్రమే మొకలు నాటాల్సి ఉందని చెప్పారు. ఉపాధిహామీ పనుల్లో భాగంగా కూలీలకు వంద శాతం పనులు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎంపీపీ, ఎంపీడీవో, ఏపీవో తదితరులు గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. మొక్కలు సంరక్షించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కానుగంటి భూమిరెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎక్సైజ్ ఎస్ఐ సరిత, ఏపీవో జిల్లా రాధ, గౌడ సంఘం అధ్యక్షుడు వీరగోని విజ్జగిరి, వార్డు సభ్యులు కొమురయ్య, రమణయ్య తదితరులు ఉన్నారు.
ఎక్సైజ్ ఆధ్వర్యంలో హరితహారం
మండలంలోని చాకలివానిపల్లి, గన్నేరువరంలో ఎక్సైజ్ డే సందర్భంగా మంగళవారం ఎక్సైజ్ అధికారులు గీత కార్మికులతో కలిసి హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 500 ఖర్జూర మొక్కలు నాటారు. ఎక్సైజ్ సీఐ ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ఈత, తాటి, ఖర్జూర మొక్కలను నాటి వాటిని సంరక్షించినట్లయితే వనాలు సమృద్ధిగా పెరిగి గీత కార్మికులకు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నక్క మల్లయ్య, ఎక్సైజ్ ఎస్ఐ సరిత, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.