మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 7: టీఆర్ఎస్ను గ్రామాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పార్టీ మండలాధ్యక్షుడు, మానకొండూర్ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని మద్దికుంట, పోచంపల్లి, లింగాపూర్, జగ్గయ్యపల్లి గ్రామాల్లో మానకొండూర్ పీఏసీఎస్ చైర్మన్ నల్ల గోవింద రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వాల ప్రదీప్ రావు, వైస్ చైర్మన్ సతీశ్‌గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ రామంచ గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులతో పాటు కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. మద్దికుంట గ్రామాధ్యక్షుడిగా గోపగోని నరేందర్ గౌడ్, పోచంపల్లి గ్రామాధ్యక్షుడిగా పొలం సమ్మయ్య, లింగాపూర్ గ్రామాధ్యక్షుడిగా మోటం సమ్మయ్య, జగ్గయ్యపల్లి గ్రామాధ్యక్షుడిగా చెంచు వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కోసమే కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, అంకితభావంతో పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్కు కార్యకర్తలే శ్రీరామరక్ష: గూడూరి
టీఆర్ఎస్కు కార్యకర్తలే శ్రీరామ రక్ష అని పార్టీ యువజన విభాగం మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేశ్ పేర్కొన్నారు. మంగళవారం హన్మాజీపల్లి, మైలారం, సాంబయ్య గ్రామాల్లో టీఆర్ఎస్ కమిటీలను ఇన్చార్జిలు నియమించారు. మైలారం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నూకల తిరుపతి, హన్మాజీపల్లి కమిటీ అధ్యక్షుడిగా ఏమ్రెడ్డి సంజీవ్‌రెడ్డి, సాంబయ్యపల్లి కమిటీ అధ్యక్షుడిగా లెంకల మల్లయ్య నియామకమయ్యారు. వీరికి ఇన్చార్జిలు న్యాత సుధాకర్, బూర వెంకటేశ్వర్లు, సర్పంచులు లింగాల రజితా మహేందర్‌రెడ్డి, చింతలపెల్లి నర్సింహారెడ్డి, యువజన నాయకుడు గూడూరి సురేశ్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామాల్లో పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు తోట కోటేశ్వర్, గువ్వ వీరయ్య, జక్కనపెల్లి సత్తయ్య, మర్రి వెంకటమల్లు, వరాల సత్తయ్య, తోట పరశయ్య, తిరుపతి, కుమార్ యాదవ్, గడ్డం కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్కండ్ల టీఆర్ఎస్ యూత్ కార్యవర్గం
అర్కండ్ల గ్రామ టీఆర్ఎస్ యూత్ కార్యవర్గానికి మంగళవారం ఎన్నికలు నిర్వహించినట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ తెలిపారు. గ్రామ యూత్ అధ్యక్షుడిగా నేదురు ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా యంనూరి నవీన్, ఇజ్జిగిరి రమేశ్, కార్యదర్శిగా చేర్ల మోహన్, కోశాధి కారిగా యంనూరి హరీశ్, కార్యవర్గ సభ్యులుగా నేదురు ప్రశాంత్, ఇజ్జిగిరి సునీల్, ఇజ్జిగిరి శ్రీధర్, చిలువేరు తిరుపతి, నేదురు శ్రీకాంత్, యంనూరి అనిల్, యంనూరి రమేశ్, యంనూరి మధు, ఇజ్జిగిరి కుమార్, చేర్ల వినయ్ ఎన్నికైనట్లు వెల్లడించారు. జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
వచ్చునూర్ టీఆర్ఎస్ గ్రామ కమిటీ
వచ్చునూర్ గ్రామ టీఆర్ఎస్ నూతన కమిటీ అధ్యక్షుడిగా అందె సంతోష్, ప్రధాన కార్యదర్శిగా గారిగె శంకర్, యూత్ అధ్యక్షుడిగా కర్ణకంటి లవకుమార్, ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి నరేశ్‌ను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేశ్, ఎలుక ఆంజనేయులు పర్యవేక్షించారు. సర్పంచ్ ఉప్పులేటి ఉమారాణి, ఎంపీటీసీ కనుకం కొమురయ్య, నాయకులు ఒడ్డె రాజిరెడ్డి, శంకర్, గోపి తదితరులు పాల్గొన్నారు.
పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు
టీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుకొమ్మలని ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్, పార్టీ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మండల్యాక్షుడు రామోజు కృష్ణామాచారి పేర్కొన్నారు. మండలంలోని గాగిరెడ్డిపల్లె, గునుకులపల్లె గ్రామాల్లో మంగళవారం టీఆర్ఎస్ గ్రామకమిటీ సమావేశాలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. సమావేశంలో ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, సింగిల్‌విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్‌రెడ్డి, సర్పంచులు సన్నీల్ల వెంకటేశం, నాయకులు కొమ్మెర మహేందర్‌రెడ్డి, మల్లేశ్, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.