గన్నేరువరం, ఆగస్టు 31: మండలంలోని ఊర చెరువుల మత్తడి నీటి ప్రవాహంతో ప్రమాదకరంగా ఉన్న ప్రధాన రహదారులపై కల్వర్టులను అతి త్వరలోనే నిర్మించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని జంగపెల్లి, గునుకులకొండాపూర్ గ్రామాల్లోని కల్వర్టుల వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. మండల కేంద్రంలోని వార సంతను పరిశీలించారు. సంత వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. అనంతరం సింగిల్ విండో డైరెక్టర్ బోయిని అంజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో వరదల మూలంగా ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నదని, అతి త్వరలోనే గన్నేరువరం చెరువు వద్ద బ్రిడ్జిని, గునుకుల కొండాపూర్, జంగపెల్లి గ్రామాల వద్ద కల్వర్టులను నిర్మించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, బూర వెంకటేశ్వర్లు, గంప వెంకన్న, గూడూరి సురేశ్, తోట కోటేశ్వర్, అటికం శ్రీనివాస్, పుల్లెల సాయికృష్ణ, జాలి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మండలంలోని లింగాపూర్, చింతగుట్ట, తాడికల్, మలంగూర్, చింతలపల్లి, ఆముదాలపల్లి, రాజాపూర్ గ్రామాలకు చెందిన 15 మందికి దాదాపు రూ. 6 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పంపిణీ చేశారు. అలాగే కరీంపేట్ గ్రామానికి చెందిన గర్రం విజయ-రాజు దంపతుల కూతురు మైత్రేయకు తలలో ఏర్పడిన కంతి చికిత్సకు వైద్య ఖర్చులు భరించే స్తోమత లేకపోవడంతో మంగళవారం ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ నిమ్స్ దవాఖాన వైద్యులతో మాట్లాడి శస్త్ర చికిత్స చేయించేందుకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను రసమయికి చెప్పుకొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ బొజ్జ కవిత, కన్నాపూర్ సర్పంచ్ కాటం వెంకటరమణారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, సింగిల్‌విండో చైర్మన్ సంజీవరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్-రజియా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం హుజూరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి తిమ్మాపూర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్‌హెచ్‌జీ స్టోర్ ప్రారంభం
మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న తెలంగాణ ఎస్‌హెచ్‌జీ స్టోర్ (సూపర్ మార్కెట్)ను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మంగళవారం ప్రారంభించారు. అలాగే ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రదాన కార్యదర్శి పల్లె స్వరూపకు చెందిన నూతన కూరగాయల దుకాణాన్ని కూడా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇక్కడ పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, వినియోగదారులు, నిర్వాహకులు, తదితరులు ఉన్నారు.
మండలంలోని వన్నారం గ్రామానికి చెందిన బనుక పర్వతాలుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సాయం మంజూరు కాగా, మంగళవారం తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లబ్ధిదారు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. చెక్కు అందుకున్న పర్వతాలు కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్యే, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ జడ్పీటీసీ శేఖర్ గౌడ్, మానకొండూర్ ఏఎంసీ చైర్మన్ వాల ప్రదీప్ రావు, వైస్ చైర్మన్ సతీశ్‌గౌడ్ ఉన్నారు.