సారంగాపూర్, ఫిబ్రవరి 24: పేదల చెంతకే రాష్ట్ర సర్కారు సంక్షేమ పథకాలను చేరుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం సారంగాపూర్ మండలంలోని బీర్పూర్, తుంగూర్, కొల్వాయి, తాళ్లధర్మారం, కండ్లపల్లి, మంగెళ, రంగసాగర్ గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాలకు చెందిన 12 మం దికి మంజూరైన 12,01, 392 కల్యాణలక్ష్మి చెక్కులు, తొమ్మిది మందికి 2,82,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇండ్లకు బైక్‌పై వెళ్లి స్వయంగా అందించారు. బీర్పూర్లో సీసీ రోడ్డు, మున్నురుకాపు సంఘ భవనంలో కాంక్రీట్ బెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆయా చోట్ల ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, నాయకులపై ఉందన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొల్వాయిలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మె మొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, ఎంపీపీ మసర్తి రమేశ్, జడ్పీటీసీ పాత పద్మారమేశ్, పార్టీ అధ్యక్షుడు నారపాక రమేశ్, ప్రధాన కార్యదర్శి శీలం రమేశ్, ఉపాధ్యక్షులు రామకిష్టు గంగాధర్, శ్రీనివాస్‌రావు, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కొల్ముల రమణ, మండల యూత్ అధ్యక్షుడు గాజర్ల రాంచంద్రంగౌడ్, ప్రజాప్రతినిధులు గర్షకుర్తి శిల్ప, రిక్కల ప్రభాకర్, ఎడ్ల సృజన, గుడిసె శ్రీమతి, ఆడెపు మల్లేశ్వరి, మేసు ఏసుదాసు, ఎలగందుల లక్ష్మి, నల మైపాల్‌రెడ్డి, మరి య, చుంచు శారద, పర్వతం రమేశ్, అజ్మీరా ప్రభాకర్, సుగుణ, స్వప్న పాల్గొన్నారు.