గంగాధర, సెప్టెంబర్ 6 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, గంగాధర సింగిల్ విండో అధ్యక్షుడు దూలం బాలగౌడ్ అన్నారు. మధురానగర్, గంగాధర, చెర్లపల్లి(ఎన్), సర్వారెడ్డిపల్లి గ్రామాల్లో సోమవారం టీఆర్ఎస్ గ్రామ స్థాయి సమావేశం నిర్వహించి, టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ప్రకటించారు.
గంగాధర గ్రామ శాఖ కమిటీ
అధ్యక్షుడిగా పొన్నం వెంకటేశంగౌడ్, ఉపాధ్యక్షుడిగా తాళ్ల వరుణ్, ప్రధాన కార్యదర్శిగా సామంతుల మహిపాల్, కార్యదర్శులగా మైదం కిషన్, రుద్రాక్ష లింగమూర్తి, ప్రచార కార్యదర్శిగా గంగాధర అనిల్, కార్యవర్గ సభ్యులుగా లోకిని అంజయ్య, లింగాల రాజు, కొరవేణి నవీన్, మడ్లపెల్లి ప్రణయ్, ముద్రకోల రాజమౌళి, తాళ్ల మల్లేశం, పెగడ జలంధర్‌ను నియమించారు.
మధురానగర్..
అధ్యక్షుడిగా తూం తిరుపతి, ఉపాధ్యక్షులుగా తూం రమేశ్, వేముల భాస్కర్, ప్రధాన కార్యదర్శులుగా వేముల అంజి, తూం మల్లారెడ్డి, కార్యదర్శులుగా వొడ్నాల రాంరెడ్డి, వొడ్నాల జగన్మోహన్రెడ్డి, ప్రచార కార్యదర్శులుగా వాసాల గంగాధర్, ఇప్పలపెల్లి మధుసూదన్, కోశాధికారిగా తూం సత్తయ్య, కార్యవర్గ సభ్యులుగా ఎండీ అబ్బాస్, కోల లింగారెడ్డి, తూం రాజిరెడ్డి, తూం నర్సయ్యను నియమించారు.
చెర్లపల్లి(ఎన్) ..
అధ్యక్షుడిగా ఎడవెల్లి బాపురెడ్డి, ఉపాధ్యక్షుడిగా పెద్దల్ల లింగయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎడవెల్లి మోహన్‌రెడ్డి , కార్యదర్శిగా మూలె తిరుపతిరెడ్డి, ప్రచార కార్యదర్శిగా మొట్టె మల్లేశం, కోశాధికారిగా ఎడవెల్లి ముకుందారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా జడ నర్సయ్య, ఎడవెల్లి మోహన్‌రెడ్డి, సాయిల్ల అంజయ్య, కోరెపు లచ్చయ్య, ఎగుర్ల ఐలయ్యను నియమించారు.
సర్వారెడ్డిపల్లి ..
అధ్యక్షుడిగా మోదుగు నల్లకొండయ్య, ఉపాధ్యక్షుడిగా రేగుల తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా కరబూజ రాజేశం, కార్యదర్శిగా తూడి రమేశ్, ప్రచార కార్యదర్శిగా సింగదాసరి శంకరయ్య, కోశాధికారిగా దుబ్బాసి భూమయ్య, కార్యవర్గ సభ్యులుగా దుబ్బాసి ఎల్లమ్మ, దుబ్బాసి పూలమ్మ, కరబూజ కవితను నియమించారు. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రామకమిటీల నియామకం
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆర్నకొండ, రాగంపేట, చిట్యాలపల్లి గ్రామ కమిటీలను నియమించారు. ఆర్నకొండ అధ్యక్షుడిగా అమరగొండ రాజేశం, రాగంపేట అధ్యక్షుడిగా గోపు శ్రీనివాస్‌రెడ్డి, చిట్యాలపల్లి అధ్యక్షుడిగా ఉస్కమల్ల మధును నియమించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మచ్చ రమేశ్, కోఆప్షన్ సభ్యుడు పాషా, సర్పంచులు విద్యాసాగర్‌రెడ్డి, సురేశ్, నాయకులు మాచర్ల వినయ్, బత్తిని సంపత్, మామిడి రాజేశం పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య సూచించారు. సోమవారం కరీంనగర్ మండలం నల్లగుంటపల్లి, మొగ్దుంపూర్లో టీఆర్ఎస్ గ్రామ శాఖ ఎన్నికలు పార్టీ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు కాశెట్టి శ్రీనివాస్, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్అహ్మద్, సర్పంచ్ జక్కం నర్సయ్య, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, కరీంనగర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు, వడ్లూరి కిరణ్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దామెరపల్లి అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడిగా మైలారం నాగరాజును ప్రకటించారు.
నల్లగుంటపల్లి గ్రామ కమిటీ ..
అధ్యక్షుడిగా వడ్లూరి సతీశ్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా విలాసాగరం శ్రీనివాస్, కార్యదర్శిగా అట్ల నర్సయ్య, సంయుక్త కార్యదర్శిగా విలాసాగరం రాజమల్లు, కోశాధికారిగా, దుబాసి శంకర్, ప్రచార కార్యదర్శిగా అట్ల మల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా వట్లూరి అజయ్‌కుమార్, విలాసాగరం సంపత్, అట్ల సంపత్, విలాసాగరం అయిలయ్య, నల్లగుంటపల్లిని నియమించారు. బీసీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా విలాసాగరం సతీశ్, ఉపాధ్యక్షుడిగా అట్ల సంపత్, కార్యదర్శిగా అట్ల సంపత్ చిన్నా, సంయుక్త కార్యదర్శిగా విలాసాగరం బాలమల్లయ్య, కోశాధికారిగా అట్ల అనిల్, ప్రచార కార్యదర్శిగా విలాసాగరం రవిని నియమించారు. ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షుడిగా అమ్మిగల శ్రీనివాస్, యువజన విభాగం కమిటీ అధ్యక్షుడిగా అట్ల రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా అమ్మిగల రాజమ్మ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అట్ల సంపత్, శ్రీనివాస్, రాజయ్య, కిరణ్ పాల్గొన్నారు.
మొగ్దుంపూర్ గ్రామ కమిటీ ..
అధ్యక్షుడిగా మైలారం నాగరాజు, ఉపాధ్యక్షుడిగా కోరెం శ్రీనివాస్, కార్యదర్శిగా వడ్లూరి అశోక్, సంయుక్త కార్యదర్శిగా దుర్గం మల్లయ్య, కోశాధికారిగా రామగిరి శంకరయ్య, యువజన విభాగం అధ్యక్షుడిగా పురెల్ల నిఖిల్, ఉపాధ్యక్షుడిగా పోన్నం పరశురాములు, కార్యదర్శి గా తంగెళ్లపల్లి చందు, సంయుక్త కార్యదర్శిగా దుర్గం రాజశేఖర్, కోశాధికారిగా కందుల రోహిత్, కార్యవర్గ సభ్యులుగా వీరగోని మనీశ్, రామగిరి సాయినాథ్, దాడి రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూమయ్య, కందుల రమేశ్, మంద తిరుపతి, దాడి లచ్చయ్య, దాడి లక్ష్మయ్య, యాదగిరి పాల్గొన్నారు.
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడని, ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని పార్టీ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గుండి, వెలిచాల, గోలిరామయ్యపల్లి, కొరటపల్లి గ్రామ కమిటీలను సోమవారం ప్రకటించారు. గుండి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గుమ్మడి జలపతి, వెలిచాలలో చిమ్మల్ల మహేశ్, గోలిరామయ్యపల్లిలో నునుగొండ తిరుపతి, కొరటపల్లిలో మేకల కిరణ్ ఏకగ్రీవంగా నియమించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, నాయకులు కలిగేటి లక్ష్మణ్, సర్పంచులు మన్నె దర్శన్రావు, వీర్ల రవీందర్రావు, సంజీవరావు, గుండి ప్రవీణ్, గడ్డం మోహన్‌రావు, మన్నె రవీందర్, కొలిపాక మల్లేశం, నరసింహరాజు, ప్రశాంత్, అజయ్, తిరుపతి పాల్గొన్నారు.