జిల్లాకేంద్రంలో పర్యటించనున్న అమాత్యుడు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
మార్కండేయ జయంతి శోభాయాత్రకు హాజరు
భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, పద్మశాలీ సంఘం నేతలు
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నా రు. మధ్యాహ్నం 1.30 గంటలకు సిరిసిల్లకు చేరుకుంటారు. పట్టణంలో 15 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 3వ వార్డులో సీసీ కెమెరాలు, హైమాస్ట్ లైట్లు, స్వీపింగ్ మిషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సుభాష్‌నగర్‌లోని 5వ వార్డులో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అదే వార్డులో సీసీ కెమెరాలను ప్రారంభిస్తారు. 2.30 గంటలకు జిల్లా ఏరియా దవాఖానలో పిడియాట్రిక్ కేర్ యూనిట్‌ను ప్రారంభించి, 3 గంటలకు తారకరామనగర్‌లో మున్సిపల్ పార్కును, 3.30 గంటలకు సుందరయ్యనగర్‌లో ధోబీఘాట్, వెంకంపేటలో యాదాద్రి డెన్స్ ప్లాంటేషన్, 4.00 గంటలకు బైపాస్‌రోడ్డులోని నర్సింగ్ కళాశాల వద్ద సఖీ సెంటర్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు పద్మశాలీ సంఘం నిర్వహించే శ్రీమార్కండేయ శోభా యాత్ర కు హాజరవుతారు. ఈ సందర్భంగా అధికారులు, పద్మశాలీ సంఘం నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.