ఇల్లందకుంట, ఆగస్టు 31: మండలంలోని టేకుర్తి, పాతర్లపల్లి, బుజూనూర్, వంతడ్పుల గ్రామాల్లో మంగళవారం దళితబంధు సర్వే నిర్వహించారు. బుజూనూర్లో సర్వేకు వచ్చిన అధికారులను సర్పంచ్ సరిగొమ్ముల అరుణ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నర్సయ్య, స్పెషల్ ఆఫీసర్లు మధుసూదన్, గుర్రం రజిత, కిరణ్‌కుమార్, సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, ఆగస్టు 31: మండలంలోని బిజిగిరిషరీఫ్, వావిలాల, మాచనపల్లి, వెంకటేశ్వర్లపల్లి, జగ్గయ్యపల్లి గ్రామాల్లోని దళిత వాడల్లో అధికారులు మంగళవారం దళిత బంధు సర్వే చేశారు. లబ్ధిదారుల వివరాలను నమోదు చేసుకున్నారు. మాచనపల్లి గ్రామంలో నిర్వహించిన సర్వేను ఆర్డీవో రవీందర్‌రెడ్డి పరిశీలించారు. అధికారులను సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో క్లస్టర్ అధికారులు, ప్రత్యేకాధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులున్నారు.
సర్వే అధికారులకు ఘన సన్మానం
మండలంలోని కాట్రపల్లికి దళిత బంధు సర్వేకు వచ్చిన అధికారులను దళితులు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. సర్వేకు వచ్చిన అధికారుల్లో మానకొండూర్ ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎంపీవో ప్రభాకర్, సివిల్ సైప్లె అధికారి సురేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.మండలంలోని రెడ్డిపల్లి, హిమ్మత్‌నగర్, కొండపాక, నర్సింగపూర్ గ్రామాల దళితవాడల్లో అధికారులు దళిత కుటుంబాల సర్వేకు రాగా, దళితులు ఘన స్వాగతం పలికారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే కొనసాగింది.