పార్టీకి పెరుగుతున్న మద్దతు
హుజూరాబాద్‌లో గంగుల సమక్షంలో జైకొట్టిన పాన్ షాప్, హోటళ్ల యజమానులు
కోర్కల్, నరసింహులపల్లిలో ఏకమైన దళితులు
హుజూరాబాద్/ హుజూరాబాద్‌టౌన్/ వీణవంక రూరల్, అక్టోబర్ 10: టీఆర్ఎస్ ఇమ్మతి పెరుగుతున్నది. అన్నివర్గాల మద్దతు లభిస్తున్నది. ఆదివారం హుజూరాబాద్‌లో మంత్రి గంగుల సమక్షంలో పాన్‌షాప్ యజమానులు 60 మంది, 40 మంది హోటళ్ల యజమానులు పార్టీకి జైకొట్టారు. వీణవంక మండలం కోర్కల్, నరసింహులపల్లి గ్రామాల్లోని దళితులు మద్దతు ప్రకటించారు. ఏకగ్రీవ తీర్మానం చేసి, కేసీఆర్ వెంటే ఉంటామని, గెల్లును గెలిపిస్తామని స్పష్టం చేశారు.
పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి: మంత్రి గంగుల
కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలువాలని, ఆశీర్వదించాలని మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హుజూరాబాద్‌లో 60మంది పాన్‌షాప్ యజమానులు, 40 మంది హోటల్ యజమానులు టీఆర్ఎస్కు జైకొట్టారు. సంపూర్ణ మద్దతు పలికారు. పట్టణంలో టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి ఏకగ్రీవ తీర్మాన ప్రతిని అందించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపుకోసం శాయశక్తులా కృషిచేస్తామని గంగులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాన్‌షాప్, హోటల్ యజమానులు సురేశ్, తిరుపతి, శంకర్, నటరాజ్, భద్రయ్య, ప్రతాప నాగరాజు, ప్రశాంత్, రమేశ్, మొగిలి, నవాజ్, మొండన్న, ముజ్జు, హరిప్రసాద్, మతిన్, కృష్ణ, ఇక్బాల్, సాగర్, మురళి, భగవాన్, రవి, ముస్తఫా, సతీశ్, మల్లారెడ్డి, శ్రీకాంత్, రియాజ్, రజ్జుమియా, రాజమల్లు, రాజేందర్, సత్యనారాయణ, సదయ్య, లక్ష్మణ్, సారయ్య, శ్రీనివాస్, ఐలయ్య, బాబుమియా, భీమయ్య, రిజ్వాన్, రవి ఉన్నారు.
బీజేపీ మాటలు నమ్మొద్దు: ఎమ్మెల్యే సండ్ర
‘దళితుల ఆర్థిక అభ్యున్నతికి సీఎం కేసీఆర్ దళిత బంధును అమలు చేస్తుంటే.. బీజేపీ నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నరు. లబ్ధిదారుల్లో అపోహలు సృష్టించేందుకు యత్నిస్తున్నరు. వారి బూటకపు మాటలు నమ్మొద్దు’ అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దళితులకు పిలుపునిచ్చారు. ఆదివారం వీణవంక మండలంలోని కోర్కల్, నరసింహులపల్లి గ్రామాల దళితులు టీఆర్ఎస్కు జైకొట్టారు. గెల్లుకే ఓటేద్దామని ఏకగ్రీవ తీర్మానం చేయగా, గ్రామాల్లో దళితులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అభివృద్ధిని కోరుకునే వారు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ మాడ సాధవరెడ్డి, కోర్కల్ సర్పంచ్ మర్రి వరలక్ష్మి-స్వామి, అల్గువెల్లి నీరజ, ఎంపీటీసీ సంగ స్వరూపా-సమ్మయ్య దళిత నాయకులు తాండ్ర శంకర్, జీడి తిరుపతి, లక్ష్మణ్, రమేశ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
జైకొట్టిన ఎరుకల కులస్తులు
గత ప్రభుత్వాలు ఎరుకల కులస్తులను పట్టించుకున్న పాపాన పోలేదని, స్వరాష్ట్రంలో తమ బతుకులు మారాయని, అన్ని విధాలా ఆదుకుంటున్న టీఆర్ఎస్కే మా మద్దతిస్తామని హుజూరాబాద్ ఎరుకల కులస్తులు స్పష్టం చేశారు. ఆదివారం హుజూరాబాద్ మండలం, పట్టణంలోని ఎరుకల ప్రజలు టీఆర్ఎస్కు జైకొట్టారు. పఠాన్‌చేరు మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ సారథ్యంలో టీపీవైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు ఆధ్వర్యంలో సిద్దిపేట కౌన్సిలర్ కెమసారపు ప్రవీణ్, దుబ్బాక కౌన్సిలర్ నిమ్మ రజిత కలిసి కులస్తులకు పథకాలను వివరించగా, వారి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు అండగా ఉండి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎరుకల సంఘం మండల ప్రధాన కార్యదర్శి కుతాడి రమేశ్, సహకార సంఘం డైరెక్టర్ కుతాడి కనుకయ్య, మండల కోశాధికారి కెమసారపు సంపత్, వ్యవసాయ మారెట్ కమిటీ డైరెక్టర్ రేవెల్లి కొమురయ్య, నాయకులు లోకిని శ్రీనివాస్, లోకిని ఓదేలు, కుతాడి తిరుపతి, కుతాడి భిక్షపతి, కుతాడి పెద్ద తిరుపతి, కుతాడి వెంకటయ్య, కుతాడి సమ్మయ్య, దుద్యాల జగదీశ్వర్, రేణుక, పద్మ, లోకిని పూర్ణచందర్, కెమసారపు రమేశ్, కెమసారపు రాజమ్మ, దుగ్యాల మణెమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.