కార్పొరేషన్, డిసెంబర్ 6: వాహనాల చప్పుళ్లు.. రోడ్డుపైనే క్రయవిక్రయాలు.. ఎక్కడపడితే అక్కడ వాహనాల పార్కింగ్తో అంతా గజిబిజిగా కనిపించే కరీంనగర్ మార్కెట్ రోడ్డులో ట్రాఫిక్ కష్టా లు గట్టెక్కినయ్.. నగరపాలక అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టడంతో ఈ ప్రాంతం విశాలంగా మారింది. సీసీరోడ్లు, ఫుట్‌పాత్‌లను నిర్మించడంతో ఇబ్బందులు తప్పినయ్.. పోలీసులు, బ ల్దియా అధికారులు రెండు రోజుల క్రితం రో డ్డుపై క్రయవిక్రయాలను సాగించే వ్యాపారులను ఒప్పించి మార్కెట్లోకి తరలించారు. దీంతో ఈ ప్రాంతం విశాలంగా కనిపిస్తున్నది.
పర్యవేక్షణతోనే ఫలితాలు..
మార్కెట్‌రోడ్డులో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రజాప్రతినిధులతో కలిసి అనునిత్యం పర్యవేక్షించాలి. స్థానికంగా ఉన్న కూరగాయల మార్కెట్లను ప్రభుత్వ స్థలాల్లోకి మార్చితే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నగరవాసులు పేర్కొంటున్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి విక్రయాలు సాగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.