హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రచారం జోరందుకున్నది. గడపగడపకూ వెళ్లిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ముద్రించిన కరపత్రాలు పంచారు. కారు గుర్తుకు ఓటు వేసి గెల్లును గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు.
హుజూరాబాద్ పట్టణంలోని 22,23 వార్డుల్లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువకులు ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. రాజకీయాల్లో యువతను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నాడని, రానున్న రోజుల్లో ఈ రంగంలో యువత భాగస్వామ్యం పెరుగాలంటే గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘ నాయకులు టేకుల శ్రావణ్, దొడ్డిపల్లి రాకేశ్, లంకదాసరి కళ్యాణ్, తూర్పాటి పృథ్వీరాజ్, తూర్పాటి కృష్ణంరాజు, టీ రాజ్‌కుమార్, అవినాష్, బన్నీ, రవి, విజయ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని మంగళవారం మండలంలోని జగ్గయ్యపల్లి, తనుగుల గ్రామాల్లో టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి అలేటి శ్రీరాం, నాయకులు ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్, అంబేద్కర్, రాజేష్, రాజు, కృష్ణ తదితరులున్నారు.
గెల్లును ఆశీర్వదించండి
విద్యార్థి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఇందిరానగర్ కాలనీవాసులను కోరారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని 6వ, 13వ వార్డుల్లో కౌన్సిలర్ కొండ్ర జీవితానరేశ్, కొండపాక శ్రీనివాస్, కొయ్యడ కమలాకర్శ్రీదేవి ఆధ్వర్యంలో గడపగడపకూ టీఆర్ఎస్ ప్రచారం నిర్వహించగా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పాల్గొన్నారు. ఓటర్లను కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించి ఓటు అభ్యర్థించారు. కాగా ఇందిరానగర్ కాలనీలోని యువకులు టీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే 3వ వార్డులో టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో హుజూరాబాద్ అర్బన్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గందె సాయిచరణ్, టీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు వీ అనురాగ్, యూత్ నాయకులు షేక్ ఫయాజ్, వికీ, సొల్లు అరుణ్, నవీన్, సాయి పాల్గొన్నారు. 7వ వార్డులో కరపత్రాలు పంచుతూ, బొట్టు పెడుతూ ఇంటింటా ప్రచారం చేశారు.
ఇందులో హుజూరాబాద్ టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, 14వ వార్డు అధ్యక్షుడు గంట మధుకర్ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే 12, 17వ వార్డుల్లో కౌన్సిలర్లు తొగరు సదానందం, ఉజ్మానూరిన్, జిల్లా పరిషత్ కో ఆప్షన్ మాజీ సభ్యుడు జమీల్ ఆధ్వర్యంలో గడపగడపకూ తిరిగి టీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. 21వ వార్డులో మాజీ మున్సిపల్ చైర్పర్సన్, ఆ వార్డు కౌన్సిలర్ మంద ఉమాదేవీరమేశ్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. 16వ వార్డులో కార్పొరేటర్ గందె మాధవి, కౌన్సిలర్ సుశీల, నాయకులు ఇంటింటికీ తిరిగి ఓటు అభ్యర్థించారు. టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ భూంపల్లి రాజలింగం, మాజీ వార్డు సభ్యురాలు తూముల లత, నాయకులు సందమల్ల బాబు, మోరే మధు, జంగా అనిల్, వార్డు ప్రెసిడెంట్ మోరే తిరుపతి, అరవింద్, అజయ్, అశోక్, ఉపేందర్, రాజయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని మల్యాల గ్రామంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టు పెట్టి కారు గుర్తుకు ఓటేయ్యాలని అభ్యర్థించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉడుత వీరస్వామి, ఉప సర్పంచ్ కుమారస్వామి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రాజయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
గడపగడపకూ వెళ్తూ.. మద్దతు కూడగడుతూ..
కందుగుల గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా ఆయన సతీమణి శ్వేత మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టు పెట్టి, కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో ఎంపీపీ రాణి, సర్పంచ్ ప్రభావతి, ఎంపీటీసీ పద్మ, ఉప సర్పంచ్ బెల్లి రాజయ్య, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు నక్క లింగయ్య, యాదవ సంఘం గ్రామాధ్యక్షుడు రవి, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.