ఘనంగా సీఎం కేసీఆర్ ముందస్తు బర్త్‌డే వేడుకలు
రెండో రోజూ సేవా కార్యక్రమాలు
పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు
బ్లడ్ డొనేట్ చేసిన అభిమానులు, నాయకులు
కురిక్యాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, రాష్ట్ర నేత వీర్ల వెంకటేశ్వర్రావు
కరీంనగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : జన హృదయనేత.. తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలను రెండో రోజూ ఘనంగా నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పండుగలా జరుపుకొన్నారు. వాడవాడలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్యశాలలు, విద్యాలయాల్లో పండ్లు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. పలుచోట్ల అన్నదానం చేసి, కేక్‌లు కట్ చేసి ఘనంగా అభిమానాన్ని చాటుకున్నారు. ‘లాంగ్‌లీవ్ కేసీఆర్’ ‘జై జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఆలయాల్లో పూజలు, అర్చనలు చేశారు. కారణజన్ముడైన కేసీఆర్ నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని అభిలషించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఎస్బీఎస్ ఫంక్షన్హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌తోపాటు 68 మంది టీఆర్ఎస్వై నాయకులు రక్తదానం చేశారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ఫహాద్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. గంగాధర మండలం కురిక్యాలలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావుతోపాటు సుమారు వెయ్యి మంది రక్తదానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, పర్యవేక్షించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ కేక్ కట్ చేసి జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయకు తినిపించారు.
అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జమ్మికుంటలోని బీసీ హాస్టల్లో తుమ్మేటి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. మానకొండూర్ మండలం కొండపల్కల అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు పండ్లు పంచిపెట్టారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రసమయి బాలకిషన్ నేతృత్వంలో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు.